ఆట ఏదైతేనేం మ్యాచ్ మొదలైందంటే అవతలి జట్టు ఆటగాళ్లను ప్రత్యర్థిగా భావిస్తారు. వారితో ఢీ అంటే ఢీ అంటారు. అయితే ప్రత్యర్థి జట్టు ఆటగాడు గాయంతో బాధపడుతూ పెవిలియన్‌కు వెళ్తుంటే మేము సైతం అంటూ ఫీల్డింగ్ జట్టు ఆటగాళ్లు అతడిని తమ భుజాలపై మోశారు. ఇందుకు సంబంధించిన వీడియో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మనసును కదిలించింది. క్రికెట్ అనేది చాలా పేరున్న గేమ్. వ్యక్తిగతంగా రాణించడం అనేది ముఖ్యమే. న్యూజిలాండ్ అండర్ 19 చేసిన సాయం నా హృదయాన్ని కదిలించిందంటూ సచిన్ టెండూల్కర్ స్పందించాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అండర్ 19 వన్డే ప్రపంచ కప్‌లో భాగంగా న్యూజిలాండ్, వెస్టిండీస్ జట్ల మధ్య  మ్యాచ్ జరిగింది. ఈ క్రమంలో బ్యాటింగ్ చేస్తున్న మెకంజీ(99) రిటైర్డ్ హర్ట్ అయ్యి డగౌట్ వెళ్లాడు. మళ్లీ బ్యాటింగ్‌కు దిగిన మెకంజీ అదే పరుగుల వద్ద ఔటై పెవిలియన్ బాట పట్టాడు. అయితే కాలి నొప్పితో కుంటుతున్నట్లుగా మెకంజీ వెళ్లడాన్ని చూసి కివీస్ యువ ఆటగాళ్లు జెస్సీ టాష్కాఫ్, జోసెఫ్ ఫీల్డ్‌లు తమ క్రీడా స్ఫూర్తి ప్రదర్శించారు. మెకంజీని తమ చేతులతో ఎత్తుకుని పెవిలియన్ వరకు మోసుకెళ్లారు. ఇది చూసిన స్టేడియం చప్పట్లతో మార్మోగింది. కివీస్ ఆటగాళ్ల క్రీడాస్ఫూర్తిగా అందరితో పాటు సచిన్ సైతం ముగ్దుడయ్యాడు.



న్యూజిలాండ్ జాతీయ జట్టు ఆటగాళ్లు సైతం వివాదాలకు దూరంగా ఉంటారు. ఇతర జట్టు ఆటగాళ్లను ప్రత్యర్థులుగా భావించరు. ప్రత్యర్థి అనే మాట వస్తే న్యూజిలాండ్ ఆటగాళ్లు తనకు ఎప్పుడూ గుర్తుకురారని, వారంటే తనకు గౌరవమని భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో అంపైర్లు తప్పిదాలు చేసినా, ఇంగ్లాండ్ ఆటగాళ్లు అతిగా ప్రవర్తించినా న్యూజిలాండ్ మాత్రం స్నేహభావంతో మెలిగి క్రీడాస్ఫూర్తిని చాటి చెప్పడం తెలిసిందే.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..