Anushka Sharma: అనుష్క శర్మ.. టూ హాట్! ఆసక్తికర కామెంట్ చేసిన విరాట్ కోహ్లీ!!
Virat Kohli tweet about Anushka Sharma. విరాట్ కోహ్లీతో కలిసి దిగిన పోటోలను అనుష్క శర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. `వీ క్లీన్ అప్ వెల్` అంటూ అనుష్క కాప్షన్ ఇచ్చారు. ఆ ఫొటోలపై కోహ్లీ కామెంట్ చేశారు. `ఉఫ్.. అనుష్క శర్మ టూ హాట్` అని కామెంట్ చేశారు.
Virat Kohli tweet about Anushka Sharma's Latest Photos: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ సోషల్ మీడియాలో ఎంత చురుగ్గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవలి కాలంలో సినిమాలకు దూరంగా ఉన్న అనుష్క.. కూతురు వామిక అలనాపాలనతో ఫుల్ బిజీగా ఉన్నారు. అంత బిజీలో కూడా ఎప్పటికప్పుడు తమ వ్యక్తిగత విషయాలకు సంబందించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటారు. ఈ క్రమంలో అనుష్క తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఐపీఎల్ 2022తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అనుష్క శర్మ కూడా కోహ్లీతోనే ఉన్నారు. ఐపీఎల్ మ్యాచులు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. బుధవారం కోల్‌కతాతో ఆడిన మ్యాచులో బెంగళూరు గెలిచింది. ఇక మంగళవారం రాజస్థాన్‌తో బెంగళూరు మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచుకు సమయం ఉండడంతో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు సరదాగా బయటికి వెళ్లారు. శనివారం తన భర్త కోహ్లీతో కలిసి అనుష్క వీకెండ్ ఎంజాయ్ చేశారు. అక్కడ ఓ ఫోటో షూట్ కూడా చేశారు.
విరాట్ కోహ్లీతో కలిసి దిగిన పోటోలను అనుష్క శర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. 'వీ క్లీన్ అప్ వెల్' అంటూ అనుష్క కాప్షన్ ఇచ్చారు. ఆ ఫొటోలపై కోహ్లీ కామెంట్ చేశారు. 'ఉఫ్.. అనుష్క శర్మ టూ హాట్' అని కామెంట్ చేశారు. అంతేకాదు ఫైర్, లవ్ సింబల్ ఎమోజీలను కూడా జత చేశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అయింది. ఫోటోలలో అనుష్క మరియు కోహ్లీ ఒక నల్ల సోఫాలో ఒకరి పక్కన కూర్చుని కెమెరాకు పోజులిచ్చారు.
అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ ఓ షాంఫూ యాడ్ షూటింగ్‌లో తొలిసారి కలుసుకుని స్నేహితులు అయ్యారు. ఆపై ఆ స్నేహం ప్రేమగా మారింది. ఐదారేళ్లు లవ్‌లో ఉన్న విరుష్క జంట.. 2017 డిసెంబరులో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 2019 ఆగస్టులో తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు విరుష్క జోడి ప్రకటించింది. ఇక 2021 జనవరి 11న కుమార్తెకు జన్మనిచ్చారు.
Also Read: Andre Russell: బంతి చాలా ఎత్తుకు ఎగరడం చూసి చాలా కాలమైంది.. రసెల్ ఆటకు షారుఖ్ ఖాన్ ఫిదా!!
Also Read: Aryan Khan Drugs Case: ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో కీలక సాక్షి గుండెపోటుతో మృతి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.