Umran Malik started ODI Debut very well says Zaheer Khan: డెబ్యూ వన్డేలోనే టీమిండియా యువ బౌలర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ అద్భుత ప్రదర్శన చేశాడు. శుక్రవారం ఆక్లాండ్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో వేసిన తొలి ఐదు ఓవర్లలో ప్రతీ బంతిని 140 కిమీ వేగానికి మించి వేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. కివీస్ ఓపెనర్‌ డెవాన్‌ కాన్వేను ఔట్‌ చేసిన తర్వాతి బంతి 153.1 కిమీ వేగంతో దూసుకొచ్చింది. తొలి ఐదు ఓవర్లలో 19 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు కీలక వికెట్స్ పడగొట్టాడు. అయితే తర్వాతి 5 ఓవర్లలో మాత్రం పెద్దగా ప్రభావం చూపించలేదు. మొత్తంగా ఉమ్రాన్‌ తన పది ఓవర్ల కోటాలో 66 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉమ్రాన్‌ మాలిక్‌ ఫామ్‌ ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది. అందరూ అతడి వేగాన్ని మెచ్చుకుంటున్నారు. తాజాగా మాజీ పేసర్‌ జహీర్‌ ఖాన్‌ కూడా ఉమ్రాన్‌పై ప్రశంసలు కురిపించాడు. ఉమ్రాన్‌ వన్డేలను గొప్పగా ప్రారంభించాడని, అయితే అరంగేట్ర మ్యాచ్‌ కాబట్టి అతడు ఇచ్చిన స్కోర్‌ను అంతగా పట్టించుకోవద్దన్నాడు. పేస్‌ పరంగా మరింత మెరుగయ్యే అవకాశాలు భారత టీమ్ మేనేజ్మెంట్ ఇవ్వాలని జహీర్‌ సూచించాడు. 23 ఏళ్ల ఉమ్రాన్‌ మాలిక్‌ భారత్ తరఫున మూడు టీ20లు, ఒక వన్డే ఆడాడు. 



బ్రాడ్‌కాస్టర్ ప్రైమ్ వీడియోకి ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో జహీర్‌ ఖాన్‌ మాట్లాడుతూ... 'ఉమ్రాన్‌ మాలిక్‌ వన్డేలను గొప్పగా ప్రారంభించాడు. వేగమే ఉమ్రాన్‌కు అతిపెద్ద బలం. అయితే చివరి 5 ఓవర్ల కోసం ప్రత్యేకంగా సాధన చేయాల్సిన అవసరం ఉంది. ఇది తొలి మ్యాచ్‌ కాబట్టి మ్యాచ్‌ను అర్థం చేసుకుని ఆస్వాదించడం లాంటి ఎన్నో అంశాలు ఉంటాయి. అయితే అరంగేట్ర ఆటగాడిగా చూస్తే మాత్రం ఉమ్రాన్‌ గొప్ప ప్రదర్శన చేశాడు అతడు ఇచ్చిన పరుగుల కన్నా..పేస్‌, వికెట్‌ తీసే సామర్థ్యాన్ని గుర్తించాలి. ఆటపై మంచి నియంత్రణ చూపాడు. వీలైనంత వేగంగా బంతులను సంధించాలి' అని అన్నాడు. 


Also Read: Sunny Leone Pics: సన్నీ లియోన్ హాట్ ట్రీట్.. కుర్రాళ్లకు కునుకులేకుండా చేస్తున్న లేటెస్ట్ పిక్స్!  


Also Raed: Kate Sharma Cleavage Pics: కేట్ శర్మ హాట్ ట్రీట్.. క్లీవేజ్ అందాలతో రెచ్చిపోయిందిగా!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook.