యూఎస్ ఓపెన్ 2020 పురుషుల సింగిల్స్ టైటిల్ విజేతగా ఆస్ట్రియా ఆటగాడు డొమినిక్ థీమ్ (US Open 2020 Winner Dominic Thiem) నిలిచాడు. యూఎస్ ఓపెన్ నెగ్గిన తొలి ఆస్ట్రియా ఆటగాడిగా రెండో సీడ్ ఆటగాడు థీమ్ సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఉత్కంఠపోరులో ఫైనల్‌లో 2-6, 4-6, 6-4, 6-3, 7-6 తేడాతో అలెగ్జాండర్ జ్వెరెవ్‌పై (Dominic Thiem Beats Alexander Zverev) అద్భుత విజయాన్ని అందుకున్నాడు డొమినిక్ థీమ్. ఈ క్రమకంలో 71 ఏళ్ల రికార్డును థీమ్ సరికొత్త రికార్డు నమోదు చేశాడు. తొలి రెండు సెట్స్ కోల్పోయిన ఆటగాడు యూఎస్ ఓపెన్ నెగ్గడం 1949 తర్వాత ఇదే తొలిసారి. Gold Price Today: మార్కెట్‌లో నేటి బంగారం, వెండి ధరలు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

క్వార్టర్ ఫైనల్‌లో అనవతర తప్పిదం కారణంగా వరల్డ్ నెంబర్ వన్, సెర్బియా స్టార్ నొవాక్ జొకొవిచ్ డీఫాల్ట్ అయి యూఎస్ ఓపెన్ నుంచి నిష్క్రమించడంతో థీమ్‌ టైటిల్ ఫెవరెట్ అయ్యాడు. టోర్నీ ఆసాంతం రాణించిన థీమ్ ఫైనల్లో తొలి రెండు సెట్లు కోల్పోయినా.. ఒత్తిడిని జయిస్తూ వరుసగా మూడు సెట్లు నెగ్గాడు. తద్వారా యూఎస్ ఓపెన్ 2020 విజేతగా డొమినిక్ థీమ్ నిలిచాడు.  Sreesanth Ban Ends: శ్రీశాంత్‌పై ముగిసిన నిషేధం.. ఐపీఎల్ ఛాన్స్ వస్తుందా?


ఇప్పటివరకూ 4 పర్యయాలు పైనల్ చేరిన థీమ్.. నాలుగో ప్రయత్నంలో గ్రాండ్ స్లామ్ సాధించాడు. 2018, 2019లో ఫ్రెంచ్ ఓపెన్‌లో రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్‌ ఫైనల్లో నెంబర్ వన్ ప్లేయర్ జొకోవిచ్ చేతిలో ఓటమి పాలై రన్నరప్‌గా మిగిలాడు. యూఎస్ గ్రాండ్ స్లామ్ థీమ్ కెరీర్‌లో తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ కావడం గమనార్హం.  బిగ్‌బాస్ ఫైనలిస్ట్ Rashami Desai Hot Photos వైరల్


ఫొటో గ్యాలరీలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYeR