US Open 2021: యూఎస్ ఓపెన్‌లో బ్రిటిష్ క్రీడాకారిణి సంచలనం..ఫైనల్‌కు దూసుకెళ్లిన ఎమ్మా
బ్రిటిష్ టెన్నిస్ క్రీడాకారిణి ఎమ్మా రాడుకాను సంచలనం సృష్టించింది. యూఎస్ ఓపెన్‌లో మహిళల సింగిల్స్ విభాగంలో ఫైనల్స్‌కు దూసుకెళ్లిన పిన్న వయస్కురాలిగా రికార్డు నెలకొల్పింది. తాజాగా 17వ సీడ్ గ్రీస్ క్రీడాకారిణి మారియా సక్కారీపై 6-1, 6-4 తేడాతో సెమీఫైనల్స్‌లో గెలిచిన ఎమ్మా ఈ ఘనత సాధించింది.
US Open 2021: యూఎస్ ఓపెన్‌లో బ్రిటిష్ టెన్నిస్ ప్లేయర్, టీనేజర్ ఎమ్మా రెడుకాను సంచలనం సృష్టించింది. అత్యంత చిన్నవయస్సులోనే గ్రాండ్‌స్లామ్ ఫైనల్(Grand Slam final)కు చేరి సత్తా చాటింది. తద్వారా మారియా షరపోవా(17 ఏళ్ల వయసులో వింబుల్డన్ విజేత- 2004) తర్వాత ఏదేని ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లో ఈ రికార్డు సాధించిన పిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందింది.
సెమీ ఫైనల్ మ్యాచ్‌లో గ్రీస్ ప్లేయర్ మారియా సకారి(Maria Sakari)ని 6-1, 6-4 తేడాతో ఓడించి ఎమ్మా తుది పోరులో నిలిచింది. వరల్డ్ ర్యాంకింగ్స్‌లో 150వ స్థానంలో ఉన్న ఆమె.. 18 ఏళ్ల వయస్సులోనే ఈ ఘనత సాధించడం విశేషం. ఇక ఫైనల్‌లో మరో టీనేజర్, 19 ఏళ్ల కెనడా ప్లేయర్ లేలా ఫెర్నాండెజ్(Lela Fernandez)తో ఆమె తలపడనుంది. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా వెల్లడించిన యూఎస్ ఓపెన్ నిర్వాహకులు.. ‘‘ఆ ఒక్క పాయింట్ ఎమ్మా రెడుకాను జీవితాన్నే మార్చేసింది. మీరిప్పుడు యూఎస్ ఓపెన్ ఫైనల్‌లో ఉన్నారు తెలుసా’’అంటూ ఆమెను విష్ చేసింది.
Also read: Mohammed Kaif: మహేష్ బాబు డైలాగ్ చెప్పిన మాజీ క్రికెటర్..వీడియో వైరల్
దీనిపై ఎమ్మా మాట్లాడుతూ.. ‘‘నేను ఫైనల్ చేరుకున్నాను. అసలు నేనిది నమ్మలేకపోతున్నాను. నిజంగా నమ్మలేకపోతున్నాను. ఇది ఎవరైనా ఊహించారా? నేను ఇప్పుడు టెక్నికల్‌గా ఫైనల్‌లో ఉన్నాను. షాకింగ్‌గా, సంతోషంగా ఉంది’’ అంటూ భావోద్వేగానికి లోనైంది. ఇక 1999 తర్వాత ఇలా యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్(US Open Women Singles 2021) విభాగంలో ఇద్దరు టీనేజర్లు ఫైనల్‌లో తలపడటం ఇదే మొదటిసారి. గతంలో 17 ఏళ్ల సెరీనా విలియమ్స్, 18 ఏళ్ల మార్టినా హింగిస్‌ను ఓడించి టైటిల్ గెలిచింది. ఇక శనివారం ఎమ్మా, లేలా మధ్య ఆసక్తికపోరు జరుగనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook