Mohammed Kaif: మొన్న పవన్‌ డైలాగ్‌తో సెహ్వాగ్.. తాజాగా మహేష్ డైలాగ్‌తో కైఫ్

Mohammed Kaif: తెలుగు హీరోలలో పవన్‌కళ్యాణ్, మహేష్‌బాబులకు ఉన్న క్రేజ్ వేరు. వాళ్ల సినిమాల్లోని డైలాగ్స్ చెప్తూ ఇటీవల సోషల్ మీడియాలో చాలా మంది సెలబ్రిటీలు రచ్చ చేశారు. మెున్న పవర్ స్టార్ డైలాగ్ తో సెహ్వాగ్ అదరగొడితే.. తాజాగా మహేష్ బాబు డైలాగ్ చెప్పి అందరినీ ఆశ్చర్య పరిచారు మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్.

Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 10, 2021, 05:46 PM IST
  • సూపర్ స్టార్ మహేష్ బాబు డైలాగ్ చెప్పిన మాజీ క్రికెటర్
  • దూకుడు సినిమాలో డైలాగ్ చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచిన కైఫ్
  • మెున్న పవర్ స్టార్ డైలాగ్ తో అదరగొట్టిన సెహ్వాగ్
Mohammed Kaif: మొన్న పవన్‌ డైలాగ్‌తో సెహ్వాగ్.. తాజాగా మహేష్ డైలాగ్‌తో కైఫ్

Mohammed Kaif: మనదేశంలో సినిమా హీరోలకు, క్రికెటర్లకు ఉన్న క్రేజ్ వేరు. వారిని ఫ్యాషన్ ఐకాన్ గా భావిస్తూ.. తెగ ఫాలో అయిపోతుంటాం. ఆ బ్యాట్స్‌మెన్‌లా బ్యాటింగ్ చేయాలి.. లేదంటే ఆ హీరోలా డైలాగ్ చెప్పాలని చూస్తాం. ఇటీవల సోషల్ మీడియా(Social Media)లో నేరుగా క్రికెటర్లే సినిమా హీరోలను ఇమిటేట్ చేసేస్తున్నారుఇందులో డేవిడ్‌ వార్నర్‌(David Warner) ముందు వరుసలో ఉంటాడని చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే లాక్‌డౌన్‌ సమయంలో టాలీవుడ్‌(Tollywood) తారల డైలాగులు, డాన్సులతో నెట్టింట రచ్చ మామూలుగా చేయలేదు వార్నర్‌. 

ఇప్ప‌టికే వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag) కూడా ప‌వ‌న్ క‌ల్యాణ్(Pawan Kalyan) గ‌బ్బ‌ర్ సింగ్ చిత్రంలోని డైలాగ్స్ చెప్ప‌గా అవి వైర‌ల్‌గా మారాయి. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ కైఫ్‌(Mohammed Kaif) కూడా ఆ జాబితాలో చేరిపోయాడు. ఇటీవల కైఫ్‌ ఓ యూట్యూబ్‌ ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మ‌హేశ్ బాబు(Mahesh Babu) పాపుల‌ర్ డైలాగ్ చెప్పి వావ్‌ అనిపించాడు. ఇంత‌కీ ఆ డైలాగ్ ఏంటనుకుంటున్నారా? మహేశ్‌ బ్లాక్‌ బస్టర్‌ సినిమా దూకుడు(Dokudu)లోని ఓ పాపులర్‌ డైలాగ్‌ చెప్పాడు. ‘మైండ్‌లో ఫిక్స‌యితే బ్లైండ్‌గా వెళ్లిపోతా అని అప్పట్లో మన ప్రిన్స్‌ తన మేనరిజంతో చెప్పి ప్రేక్షకులకు మైండ్‌ బ్లాక్‌ చేశాడు కదా ! దాన్నే ప్రస్తుతం ఈ మాజీ క్రికెటర్‌ తన స్టైల్లో ఆ డైలాగ్‌ను చెప్పాడు. దీనిని EAGLE Sports అనే యూట్యూబ్ ఛానెల్ లో పోస్టు చేశారు. 

Also Read: Pawan Kalyan Craze: సెహ్వాగ్ నోట పవర్ స్టార్ పవర్ ఫుల్ డైలాగ్.. వీడియో వైరల్

ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ప్రత్యేకంగా ప్రిన్స్‌ ఫ్యాన్స్‌ అయితే ఈ వీడియో నచ్చడంతో తెగ షేర్లు చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. అలా ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట దూసుకుపోతుంది కాగా మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్  దర్శకత్వం వహిస్తున్న సర్కారు వారి పాట(Sarkaruvari paata) చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. కీర్తి సురేష్(Keerthi Suresh) ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News