కోహ్లీ అవుటైన క్షణాలే మధుర స్మృతులు
కేప్‌టౌన్ వేదికగా భారత జట్టుతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో విరాట్ కోహ్లీని అవుట్ చేసిన క్షణాలు తనకు ఎప్పటికీ గుర్తుంటాయని అంటున్నారు దక్షిణాఫ్రికా పేస్ బౌలర్ ఫిలాండర్.
కేప్‌టౌన్ వేదికగా భారత జట్టుతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో విరాట్ కోహ్లీని అవుట్ చేసిన క్షణాలు తనకు ఎప్పటికీ గుర్తుంటాయని అంటున్నారు దక్షిణాఫ్రికా పేస్ బౌలర్ ఫిలాండర్. స్థానిక మీడియాతో ఆయన మాట్లాడుతూ "కోహ్లీ చాలా విధ్వంసకరమైన బ్యాట్స్‌మన్. మా ప్లాన్‌లో భాగంగా తొలుత ఆయననే అవుట్ చేయాలని భావించాం. కాని నాకే ఆ అవకాశం లభించడం విశేషం. ఈ విషయం నేను ఎప్పటికీ గుర్తుంచుకోదగ్గది" అని పేర్కొన్నారు ఫిలాండర్. కోహ్లీ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తున్నపుడు భారత్ టీమ్ స్కోరు 71/3 మాత్రమే. కానీ పదే పదే విరాట్ ఆఫ్ స్టంప్‌నే టార్గెట్ చేసిన ఫిలాండర్ 14 బంతుల్లో.. ఆఖరి బంతిని లోపలికి వేసి.. కోహ్లీని పెవిలియన్‌కు పంపించాడు. కోహ్లీ అవుట్ అయ్యాక.. నిజంగానే పరిస్థితి మారిపోయింది. టెయిలెండర్ల పై ఆధారపడాల్సిన పరిస్థితి భారత జట్టుకి ఎదురైంది. ఫలితంగా చేజేతులా విజయాన్ని చేజార్చుకుంది.