విజయ్ హజారే ట్రోఫీ 2022 సీజన్‌లో భాగంగా బెంగళూరు వేదికగా తమిళనాడు వర్సెస్ అరుణాచల్ ప్రదేశ్ జట్ల మధ్య జరిగిన గ్రూప్ సి మ్యాచ్ కనీవినీ ఎరుగని రికార్డులకు వేదికగా నిలిచింది. ఆ రికార్డుల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తమిళనాడు వర్సెస్ అరుణాచల్ ప్రదేశ్ మ్యాచ్‌లో నమోదైన రికార్డులు


1. తమిళనాడు వర్సెస్ అరుణాచల్ ప్రదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన తమిళనాడు నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 506 పరుగులు చేసింది. 50 ఓవర్లలో క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకూ ఇదే అత్యధిక స్కోర్. ఇంతకుముందు అంటే గత ఏడాది జూన్ నెలలో నెదర్లాండ్స్‌పై ఇంగ్లండ్ జట్టు 4 వికెట్ల నష్టానికి 498 పరుగులు చేసింది. క్రికెట్ చరిత్రలో భారీ రికార్డ్ ఇది.


2. ఈ మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో చెలరేగిన నారాయణ్ జగదీశన్ ప్రలు ప్రపంచ రికార్డులు సృష్టించాడు. ఇదే టోర్నీలో ఇప్పటివరకూ 4 వరుస సెంచరీలు నమోదు చేసి..వరుసగా ఐదు సెంచరీలు సాధించిన ఘనత దక్కించుకున్నాడు.


3. జగదీశన్ నారాయణ్ టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డును బద్దలుకొట్టేశాడు. లిస్ట్ ఎ క్రికెట్‌లో శ్రీలంకపై రోహిత్ శర్మ గతంలో 264 పరుగులు చేయగా..ఇంగ్లండ్ క్రికెటర్ అలిస్టర్ బ్రౌన్ 268 పరుగులు చేశాడు. ఇప్పుడు జగదీశన్ ఏకంగా 277 పరుగులు చేశాడు.


4. అత్యంత వేగంగా సెంచరీ సాధించి మరో రికార్డు సృష్టించాడు. తొలి సెంచరీని 76 బంతుల్లో పూర్తి చేసిన నారాయణ్ జగదీశన్ రెండవ సెంచరీని కేవలం 38 బంతుల్లోనే పూర్తి చేశాడు. క్రికెట్ చరిత్రలో ఇదే అత్యంత వేగవంతమైన సెంచరీ. 


5. నారాయణ్ జగదీశన్ మొత్తం 141 బంతుల్లో 25 ఫోర్లు, 15 సిక్సర్లతో 277 పరుగులు సాధించాడు. జగదీశన్ సిక్సర్లు, ఫోర్లతో బెంగళూరు స్టేడియం హోరెత్తిపోయింది. 


6. అటు అరుణాచల్ ప్రదేశ్  28.4 ఓవర్లలో కేవలం 71 పరుగులకే కుప్పకూలింది. లిస్ట్ ఎ క్రికెట్ చరిత్రలో అత్యల్ప స్కోరుకు అవుట్ కావడం ఇదే రికార్డు. అదే సమయంలో 435 పరుగుల భారీ ఆధిక్యంతో లిస్ట్ ఎ క్రికెట్‌లో తమిళనాడు రికార్డు సృష్టించింది.


Also read: David Warner: నేనేమీ నేరస్థుడిని కాదు.. క్రికెట్ ఆస్ట్రేలియాపై మండిపడ్డ డేవిడ్ వార్నర్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook