David Warner: నేనేమీ నేరస్థుడిని కాదు.. క్రికెట్ ఆస్ట్రేలియాపై మండిపడ్డ డేవిడ్ వార్నర్!

David Warner hits out on Australia captaincy ban saga. బాల్ ట్యాంపరింగ్ ఉదంతం నేపథ్యంలో కెప్టెన్ కాకుండా సీఏ తనపై విధించిన జీవితకాల నిషేధం చాలా అన్యాయమని డేవిడ్ వార్నర్ ఆవేదన వ్యక్తం చేశాడు.   

Written by - P Sampath Kumar | Last Updated : Nov 21, 2022, 09:07 PM IST
  • నేనేమీ నేరస్థుడిని కాదు
  • క్రికెట్ ఆస్ట్రేలియాపై మండిపడ్డ వార్నర్
  • కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టకుండా
David Warner: నేనేమీ నేరస్థుడిని కాదు.. క్రికెట్ ఆస్ట్రేలియాపై మండిపడ్డ డేవిడ్ వార్నర్!

David Warner on Cricket Australia Captaincy Ban: క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)పై ఆసీస్ సీనియర్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. 2018 బాల్ ట్యాంపరింగ్ ఉదంతం నేపథ్యంలో కెప్టెన్ కాకుండా సీఏ తనపై విధించిన జీవితకాల నిషేధం చాలా అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశాడు. తానేం నేరస్థుడిని కాదని, పెద్ద పెద్ద క్రిమినల్‌కు కూడా అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుందని క్రికెట్‌ ఆస్ట్రేలియా తీరును వార్నర్ విమర్శించాడు. బాల్‌ టాంపరింగ్‌ వివాదం నేపథ్యంలో వార్నర్‌ భవిష్యత్తులో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టకుండా సీఏ జీవితకాల నిషేధం విధించిన విషయం తెలిసిందే.

2018 దక్షిణాఫ్రికా పర్యటనలో బెన్ క్రాఫ్ట్‌తో బాల్ ట్యాంపరింగ్‌కు డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ ప్రయత్నించారు. బంతిని సాండ్ పేపర్ సాయంతో రుద్దడం వీడియోలలో రికార్డు అవడం పెద్ద దుమారం రేపింది. క్రికెట్ చరిత్రలోనే ఈ ఘటన ఓ మాయని మచ్చగా నిలిచిపోయింది. ముఖ్యంగా వార్నర్, స్మిత్ చీటర్స్‌గా ముద్రపడ్డారు. సీఏపై ఎన్నో విమర్శలు వచ్చాయి. దాంతో సీఏ ముగ్గురి ఆటగాళ్లపై చర్యలు తీసుకుంది. వార్నర్‌, స్మిత్ లు ఏడాది పాటు ఎలాంటి క్రికెట్ ఆడకుండా నిషేధించిన సీఏ.. కెప్టెన్ కాకుండా జీవితం కాలం నిషేధం విధించింది. తనపై విధించిన జీవితకాల కెప్టెన్సీ నిషేధాన్ని తొలగించాల్సిందిగా సీఏను వార్నర్ చాలాసార్లు కోరాడు. అయినా సీఏ జాప్యం చేస్తోంది. దాంతో సీఏపై వార్నర్ ఆవేదన వ్యక్తం చేశాడు.

తాజాగా ఓ స్పోర్ట్స్ చానెల్‌కు ఇచ్చి ఇంటర్వ్యూలో డేవిడ్ వార్నర్ మాట్లాడుతూ... 'నేను నేరస్థుడిని కాదు. ప్రతీ వ్యక్తికి తన తప్పు ఏంటో, అందుకు ఎంతకాలం శిక్ష అనుభవించాలో తెలుసుకునే అవకాశం ఇవ్వాలి. ప్రతీ ఒక్కరికీ అప్పీలు చేసుకునే అవకాశం ఉండాలి. కొంతకాలం బ్యాన్ వేస్తే తప్పు లేదు కానీ జీవితకాలం అంతా కెప్టెన్సీ చేయకూడదనేది చాలా కఠిన నిర్ణయం. చాలా రోజులుగా బ్యాన్ ఎత్తివేస్తారని నేను ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నా' అని అన్నాడు. 

'గత ఫ్రిబవరిలో నాపై నిషేధం ఎత్తివేస్తారని అనుకున్నా. అది జరగలేదు. బ్యాన్ నాతో పాటు నా కుటుంబానికి చాలా కష్టంగా ఉంది. జరిగినదాన్ని ఇప్పుడు వివరించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆరోన్ ఫించ్ రిటైర్ అయిన తర్వాత నాకు కెప్టెన్సీ దక్కుతుందని చాలా ఆశించా. కానీ అలా జరగలేదు. నాలుగేళ్ల క్రితం జరిగినదాన్ని సాకుగా చూపించి.. ఇప్పుడు కెప్టెన్సీ ఇవ్వకపోవడం చాలా దారుణం. ఇది నన్ను తీవ్ర మనోవేదనకు గురిచేస్తోంది' అని డేవిడ్ వార్నర్ ఆవేదన వ్యక్తం చేశాడు.

Also Read: హాస్పిటల్ ఐసీయూలో ఆవు హడావుడి.. వైరలవుతున్న వీడియో! పేషంట్స్‌ సంగతేంటి

Also Read: భారత్, న్యూజిలాండ్‌ మూడో టీ20.. ప్లేయింగ్ ఎలెవన్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook.

Trending News