Vinesh Phogat: తృటిలో పతకాన్ని చేజార్చుకున్న వేళ తీసుకున్న రిటైర్మెంట్‌ నిర్ణయంపై వినేశ్‌ ఫొగట్‌ వెనక్కి తగ్గారు. తప్పక భారతదేశానికి పతకం అందించే తీరుతానని శపథం చేశారు. 2032 వరకు తాను రెజ్లింగ్‌లో కొనసాగుతానని ప్రకటించారు. ఈ విషయమై తన సోషల్‌ మీడియాలో వెల్లడించారు. ఈ సందర్భంగా రెండు పేజీల వ్యాసాన్ని విడుదల చేశారు. రెండు పేజీల లేఖలో కీలక అంశాలపై వివరణ ఇచ్చారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Vinesh Phogat: పతక పోరులో వినేశ్‌ ఫొగాట్‌కు పరాభవం.. మెడల్‌పై కోర్టు సంచలన తీర్పు


'మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. పతకం సాధించేందుకు చాలా కష్టపడ్డా. ప్రత్యర్థులకు ఒక్క అవకాశం ఇవ్వలేదు. వాళ్లకు లొంగిపోలేదు. కానీ పరిస్థితులు కలిసిరాలేదు.. విధి వికటించింది. అనూహ్య పరిణామాలతో వెనుదిరిగాను. 2032 వరకు పోరాడగలనని అనుకుంటున్నా. ఆ సత్తా నాకు ఉందనే నమ్మకం ఉంది. నేను నమ్ముకున్న దాని గురించి నిరంతరం పోరాడుతూనే ఉంటాననే కచ్చితంగా నమ్ముతున్నా' అని లేఖలో రాసింది.


Also Read: Saina Nehwal: నాతో ఆడితే జస్ప్రీత్‌ బుమ్రా కుప్పకూలుతాడు: సైనా నెహ్వాల్‌ షాకింగ్‌ కామెంట్స్‌


పారిస్‌ ఒలింపిక్స్‌లో సంచలన ప్రదర్శనతో ఫైనల్‌ దాకా దూసుకెళ్లిన వినేశ్‌ ఫొగట్‌ అనూహ్య పరిణామంతో టోర్నీ నుంచే వైదొలిగిన విషయం తెలిసిందే. తీవ్ర దిగ్భ్రాంతికి లోనయిన పరిస్థితుల్లో రెజ్లింగ్‌ నుంచే తాను వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. వరుస విజయాలతో దూసుకెళ్లి భారత్‌కు స్వర్ణం లేదా.. రజత పతకం చేజిక్కించుకునే వేళ వంద గ్రాముల బరువు భారత్‌కు ఒక మెడల్‌ను దూరం చేసింది.


ఒలింపిక్స్‌లో మహిళల 50 కిలోల విభాగం రెజ్లింగ్‌లో పోటీపడిన వినేశ్‌ ఆరంభం నుంచి దూకుడుగా ఆడింది. గంటల వ్యవధిలో జరిగిన ప్రి క్వార్టర్స్‌, క్వార్టర్స్‌, సెమీ ఫైనల్‌లో పూర్తి ఆధిపత్య ప్రదర్శన చేసింది. తొలి పోరులోనే ప్రపంచ నంబర్‌ వన్‌ను ఓడించి సంచలనం రేపిన వినేశ్‌ ఫొగాట్‌ సెమీ ఫైనల్‌ వరకు అదే ప్రదర్శన కొనసాగించింది. వరుసగా విజయాలు సాధిస్తూ ఒలింపిక్స్‌ ఫైనల్‌లోకి ప్రవేశించిన ఏకైక భారత మహిళా రెజ్లర్‌గా రికార్డు నెలకొల్పారు. 

ఒలింపిక్స్‌లో ఫొగట్‌ ప్రదర్శన ఇదే..

ప్రి క్వార్టర్స్: పారిస్‌ ఒలింపిక్స్‌లో మహిళల 50 కిలోల ప్రిక్వార్టర్స్‌లో జపాన్‌కు చెందిన డిఫెండింగ్‌ చాంపియన్‌ యువి సుసాకితో వినేశ్‌ ఫొగాట్‌ తలపడ్డారు. 3-2తో వినేశ్‌ ఫొగాట్‌ సంచలన విజయం సాధించారు. ఆఖరి వరకు వెనుకబడిన వినేశ్‌ ఫొగాట్‌ అనంతరం గొప్పగా పుంజుకుని ప్రపంచ నంబర్‌ వన్‌ రెజ్లర్‌ సుసాకిని చిత్తు చేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో సుసాకిని గోల్డ్‌ మెడల్‌ సాధించింది.


క్వార్టర్స్‌: క్వార్టర్స్‌లో వినేశ్‌ ఫొగాట్‌ ఉక్రెయిన్‌కు చెందిన ప్రొవొకేషన్‌ను చిత్తు చేసిది. 7-5 తేడాతో ఉక్రెయిన్‌ రెజ్లర్‌ను ఓడించింది.


సెమీ ఫైనల్‌: క్యూబాకు చెందిన రెజ్లర్‌ యస్‌నెలిస్‌ గుజ్మన్‌ను వినేశ్‌ చిత్తు చేసింది. సెమీస్‌లో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా 5-0తో వినేశ్‌ సంచలన ప్రదర్శన చేసింది. వినేశ్‌ పంచ్‌ల ముందు ప్రత్యర్థి తేలిపోయింది. ఈ విజయంతో బంగారు పతకం కోసం రేసులో నిలబడింది.



 




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి