Vinesh Phogat: చరిత్ర సృష్టించిన వినేశ్ ఫొగట్.. ఒలింపిక్స్‌లో ఫైనల్‌లోకి ప్రవేశం
Vinesh Phogat Enters Final In Paris Oympics: వరుస విజయాలతో దూసుకెళ్తున్న వినేశ్ ఫొగాట్ పారిస్ ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించింది. 50 కిలోల రెజ్లింగ్‌లో ఫైనల్‌లోకి దూసుకెళ్లి సంచలనం రేపింది.
Vinesh Phogat Paris Olympics 2024: విశ్వవిఖ్యాత ఒలింపిక్స్ క్రీడా పోటీల్లో భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్ చరిత్ర సృష్టించారు. వరుసగా విజయాలు సాధిస్తూ ఒలింపిక్స్ ఫైనల్‌లోకి ప్రవేశించిన ఏకైక భారత మహిళా రెజ్లర్‌గా రికార్డు నెలకొల్పారు. మహిళల 50 కిలోల విభాగం ప్రిక్వార్టర్స్‌లో ప్రపంచ నంబర్ వన్, టోక్యో ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ యె సుసాకిని ఓడించి.. క్వార్టర్స్‌లో ఉక్రెయిన్‌కు చెందిన ప్రొవొకేషన్‌ను చిత్తు చేసి.. సెమీ ఫైనల్‌లో క్యూబా రెజ్లర్ యస్‌నెలిస్ గుజ్మన్‌పై పూర్తి ఆధిపత్యంతో విజయం సాధించింది సంచలన విజయం నమోదు చేసింది. సెమీ ఫైనల్‌లో విజయంతో ఒలింపిక్స్ ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. ఇప్పటివరకు భారత మహిళా రెజ్లర్లు ఫైనల్‌కు చేరుకోలేదు. ఫైనల్‌కు చేరిన తొలి మహిళా రెజ్లర్‌గా వినేశ్ ఫొగాట్ రికార్డు సృష్టించింది.
Also Read: Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో భారత్ సంచలనం.. బ్రిటన్‌ను ఓడించి సెమీస్‌లోకి ప్రవేశం
ఒలింపిక్స్‌లో ప్రవేశించినప్పటి నుంచి వినేశ్ ఫొగాట్ సంచలన ప్రదర్శన కనబరించింది. గంటల వ్యవధిలో జరిగిన ప్రి క్వార్టర్స్, క్వార్టర్స్, సెమీ ఫైనల్‌లో పూర్తి ఆధిపత్య ప్రదర్శన చేసింది. ఫలితంగా పతకానికి ఒక్క అడుగు దూరంలో వినేశ్ నిలిచారు. ఈ ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణ పతకం అందించేందుకు వినేశ్ ఫొగాట్ సిద్ధమయ్యరు. ప్రపంచ నంబర్ వన్‌ను ఓడించి సంచలనం రేపిన వినేశ్ ఫొగాట్ సెమీ ఫైనల్ వరకు అదే ప్రదర్శన కొనసాగించింది.
ప్రి క్వార్టర్స్..
పారిస్ ఒలింపిక్స్‌లో మహిళల 50 కిలోల ప్రిక్వార్టర్స్‌లో జపాన్‌కు చెందిన డిఫెండింగ్ చాంపియన్ యువి సుసాకితో వినేశ్ ఫొగాట్ తలపడ్డారు. 3-2తో వినేశ్ ఫొగాట్ సంచలన విజయం సాధించారు. ఆఖరి వరకు వెనుకబడిన వినేశ్ ఫొగాట్ అనంతరం గొప్పగా పుంజుకుని ప్రపంచ నంబర్ వన్ రెజ్లర్ సుసాకిని చిత్తు చేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో సుసాకిని గోల్డ్ మెడల్ సాధించింది.
క్వార్టర్స్‌లో
విజయోత్సాహంతో క్వార్టర్స్‌లోకి ప్రవేశించిన వినేశ్ ఫొగాట్ ఉక్రెయిన్‌కు చెందిన ప్రొవొకేషన్‌ను చిత్తు చేసిది. 7-5 తేడాతో ఉక్రెయిన్ రెజ్లర్‌ను ఓడించింది.
సెమీ ఫైనల్‌లో
పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తున్న వినేశ్ ఫొగాట్ సెమీ ఫైనల్‌లోనూ అదే ప్రదర్శన కనబర్చింది. క్యూబాకు చెందిన రెజ్లర్ యస్‌నెలిస్ గుజ్మన్‌ను ఢీకొట్టింది. హోరాహోరీగా సాగుతుందనుకున్న సెమీ పోరులో వినేశ్ ఏక చత్రాధిపత్యం చేసింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా 5-0తో వినేశ్ సంచలన ప్రదర్శన చేసింది. వినేశ్ పంచ్‌ల ముందు ప్రత్యర్థి తేలిపోయింది. ఈ విజయంతో బంగారు పతకం కోసం వినేశ్ తలపడేందుకు సిద్ధమైంది.
నాడు ఢిల్లీలో అవమానం
భారత్‌కు ఒలింపిక్స్ పతకం అందిస్తున్న వినేశ్ ఫొగాట్ గతంలో ఢిల్లీలో ఘోర అవమానం ఎదుర్కొంది. రెజ్లర్లపై లైంగిక దాడికి పాల్పడ్డారనే విషయమై రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడికి వ్యతిరేకంగా ఉద్యమం చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఢిల్లీలో రెజర్లతో కలిసి వినేశ్ ఫొగాట్ పోరాటం చేసింది. కొన్ని రోజుల తరబడి రోడ్డుపై నిరసన వ్యక్తం చేయగా.. పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. ఉద్యమం చేస్తున్న వినేశ్ ఫొగాట్‌ను పోలీసులు ఈడ్చి తీసుకెళ్లారు. దీంతో వినేశ్ కన్నీటి పర్యంతమైన ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో మరోసారి ప్రత్యక్షమయ్యాయి. ఢిల్లీలో రోడ్లపై ఈడ్చుకెళ్లిన వినేశ్ ఫొగాట్ ఇప్పుడు అంతర్జాతీయ క్రీడా పోటీల్లో భారతదేశానికి పతకం తీసుకురాబోతున్నది. దీంతో నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చురకలు అంటిస్తున్నాయి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter