Australians Winning Celebration Viral video: UAE వేదికగా జరిగిన T20 World Cup 2021 ముగిసింది. కొత్త ఛాంపియన్‌గా తొలిసారి టీ20 ప్రపంచకప్ 2021 (T20World Cup 2021) కంగారూలు కైవసం చేసుకున్నారు. ఆస్ట్రేలియా వర్సెస్ న్యూజిలాండ్ దేశాల మధ్య జరిగిన టీ20 ప్రపంచకప్ 2021 ఫైనల్‌లో న్యూజిలాండ్ జట్టుపై ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తొలిసారిగా టీ20 ఫార్మట్ క్రికెట్‌లో ప్రపంచకప్ సాధించింది. అద్బుతంగా రాణించి టైటిల్ గెల్చుకోవడంలో కీలకపాత్ర పోషించిన డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్‌లతో పాటు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌లు అరుదైన రికార్డు కూడా సొంతం చేసుకున్నారు.


Also Read: S400 Missiles: ఇండియాకు ఎస్ 400 క్షిపణుల సరఫరా ప్రారంభం




తుదిపోటులో విజయం సాధించిన ఆస్ట్రేలియా.. మరో 7 బంతులు మిగిలి ఉండగానే.. టార్గెట్ ఖతం చేసి.. ప్రపంచ కప్ ను ముద్దాడింది. మైదానంలో ఆస్ట్రేలియా జట్టు సంబరాలకు అవధులు లేకుండా పోయాయి.. సౌథీ బౌలింగ్ లో మాక్స్ వెల్ ఫోర్ కొట్టిన తరువాత.. బాల్ బౌండరీ చేరుకోక ముందే.. ఆస్ట్రేలియా జట్టు సభ్యులు మైదానంలో పరిగెత్తుకు వెళ్లి.. సంబరాల్లో మునిగి తేలిపోయారు. 


ఇక డ్రెస్సింగ్ రూమ్ లో అయితే వారి సంబరాలకు బ్రేకుల్లేవనే చెప్పాలి.. ఇక వికెట్ కీపర్   మాథ్యూ వేడ్, స్టోయినీస్ షూలో బీర్ పోసుకొని తాగిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. డ్రెస్సింగ్ రూమ్ లో చేసుకున్న సెలబ్రేషన్ వీడియోలు ఐసీసీ తన అధికారిక  ఇన్‌స్టాగ్రామ్  ఖాతాలో పోస్ట్ చేసింది. వీడియో చూసిన నెటిజన్లు ఆస్ట్రేలియా టీమ్ ను అభినందిస్తూనే.. ఇదెక్కడి సెలబ్రేషన్స్ అంటూ ఆశ్చర్యపోతున్నారు. 




Also Read: Akhanda Trailer: ‘'మీకు సమస్య వస్తే దండం పెడతారు..మేము ఆ సమస్యకే పిండం పెడతాం'..అదిరిన 'అఖండ' ట్రైలర్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి