Australia lifted their maiden T20 World Cup trophy: టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్‌గా ఆస్ట్రేలియా నిలిచింది. ఫైనల్స్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో (NZ vs AUS) ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీనితో టీ20 వరల్డ్‌కప్ టైటిల్‌ను తొలిసారి (Australia lift T20 World Cup) సొంతం చేసుకుంది ఆస్ట్రేలియా. తొలిసారి ఫైనల్స్‌లో అడుగు పెట్టిన న్యూజిలాండ్.. గట్టి పోటీ ఇచ్చినా ఓటమి తప్పలేదు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఏడు బంతులు మిగిలి ఉండగానే.. అంటే 18.5 ఓవర్లలోనే ఛేదించి విజయ ఢంకా మోగించింది ఆస్ట్రేలియా.
Glory for Australia 🏆
Heartbreak for New Zealand 💔How it all transpired in the #T20WorldCupFinal 👇#T20WorldCup https://t.co/qe4TjKfSn7
— T20 World Cup (@T20WorldCup) November 14, 2021
Also read: Virat Kohli: తమ కూతురు వామికాతో కలిసి దుబాయ్ నుంచి తిరిగొచ్చిన అనుష్క, కోహ్లీ
ఎవరెవరు ఎలా ఆడారంటే..
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్లు.. మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్ అద్భుత ప్రదర్శన చేశారు. మిచెల్ మార్ష్ 50 బంతుల్లో 77 పరుగులు చేయగా.. మ్యాక్స్ వెల్ 18 బంతుల్లో 28 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. 107 పరుగుల వద్ద ఔటైన డేవిడ్ వార్నర్ 37 బంతుల్లో 53 పరుగులు చేశాడు. కివీస్ బౌలర్ బౌల్ట్ వేసిన 12.2వ ఓవర్లో క్లీన్ బౌల్డయ్యాడు వార్నర్. కెప్టెన్ అరోన్ ఫించ్ 5 (7 బంతుల్లో) పరుగులకే ఔటయ్యాడు. ఈ వికెట్ కూడా బౌల్డ్కే పడటం గమనార్హం. ఫించ్ ఔటయినప్పుడు ఆస్ట్రేలియా స్కోరు 15 మాత్రమే.
Also read: Nathan Lyon On India: ‘స్వదేశంలో టీమ్ఇండియాను ఓడించాలి.. అదే నా అతిపెద్ద లక్ష్యం’
న్యూజిలాండ్ బ్యాటింగ్ ఇలా..
న్యూజిలాండ్ ఆటగాళ్లలో కేన్ విలియమ్సన్ అదరగొట్టాడు. 48 బంతుల్లో 85 పరుగులు చేసి ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపించాడు. మార్టిన్ గప్తిల్ 35 బంతుల్లో 28 పరుగులు చేశాడు. మిగతా ఆటగాళ్లు అంతగా రాణించలేకపోయారు. ఆసీస్ బౌలర్లలో హేజిల్‌వుడ్ మూడు, జంపా ఓ వికెట్ పడగొట్టారు.
అంచనాలన్నీ ఆస్ట్రేలియాపైనే..
మ్యాచ్ జరగక ముందు నుంచే.. ఆస్ట్రేలియాపై కప్ గెలుస్తుందని భారీ అంచనాలు ఉన్నాయి. క్రెకెట్ దిగ్గజాలు సునీల్ గావస్కర్, సౌరవ్ గంగూలీ సహా ఇతర మాజీ ప్లెయర్స్ ఆస్ట్రేలియానే గెలుస్తుందని జోస్యం చెప్పారు. వారి అంచనాలను నిజం చేస్తూ.. ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించింది.
Also read: NZ vs AUS: ఆస్ట్రేలియాతో ఫైనల్స్ మాకు ఓ సాధారణ మ్యాచ్: కేన్ విలియమ్సన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook