Virat Kohli and Babar Azam to play same team for Afro-Asia Cupభారత్, పాకిస్తాన్ దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుందన్న విషయం తెలిసిందే. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్, పాక్ గత కొన్నేళ్లుగా ఉప్పు నిప్పుగా ఉంటున్నాయి. 2007 తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య సంబంధాలు దెబ్బతినడంతో ఇరు దేశాల మధ్య క్రికెట్ కూడా సాధ్యం అవడం లేదు. ఐసీసీ టోర్నీలలో తలపడడం తప్పితే.. ద్వైపాక్షిక సిరీసులు ఆడిన ఎన్నో ఏళ్లు అయింది. అలాంటిది ఇరు దేశ ఆటగాళ్లు కలిసి ఒకే జట్టులో ఆడనున్నారు. విరాట్‌ కోహ్లీ, బాబర్‌ ఆజమ్‌.. షాహిద్ ఆఫ్రిది, జస్ప్రీత్ బుమ్రాలు ఒకే జట్టులో ఆడనున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీ20 క్రికెట్, ఇతర క్రికెట్ టోర్నీల వల్ల మరుగున పడ్డ ఆఫ్రో-ఆసియా కప్ టోర్నీ త్వరలో జరగనుంది. ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ)  ఈ టోర్నీని పునఃప్రారంభించాలని కసరత్తు చేస్తుంది. పలు కారణాల వలన 2007లో నిలిచిపోయిన ఆఫ్రో-ఆసియా టోర్నీని తిరిగి నిర్వహించేందుకు ఏసీసీ ప్రతినిధులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా భారత క్రికెట్‌ బోర్డు (బీసీసీఐ), పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ)సహా ఇతర క్రికెట్‌ బోర్డులతో సంప్రదింపులు జరుపుతున్నారు.


ఏసీసీ కమర్షియల్ అండ్ ఈవెంట్స్ హెడ్ ప్రభాకరన్ తన్రాజ్ మాట్లాడుతూ... 'నిజమే.. మేం ఆఫ్రో-ఆసియా కప్ టోర్నీపై చర్చిస్తున్నాం. ఈ విషయంపై ఆయా బోర్డులకు ప్రతిపాదనలు పంపాం. అయితే ఇది ఇప్పటికీ పేపర్ మీదే ఉంది. ఎలాగైనా టోర్నీ నిర్వహించాలని చూస్తున్నాం. ప్రపంచంలోనే అగ్ర జట్లుగా ఉన్న భారత్ , పాకిస్థాన్​తో పాటు దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ వంటి జట్లు కలిసి ఆడటం క్రికెట్ ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుంది. బోర్డుల నుంచి అనుమతి కోసం కృషి చేస్తున్నాం' అని అన్నారు. 


ఆఫ్రో-ఆసియా టోర్నీ తొలిసారి 2005లో జరిగింది. అప్పుడు షాహిద్ అఫ్రిది, వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్, సనత్‌ జయసూర్య లాంటి స్టార్ ఆటగాళ్లు కలిసి ఆసియా జట్టుకు ప్రాతినిధ్యం వహించగా.. గ్రేమ్‌ స్మిత్‌, ఏబీ డివిలియర్స్‌, జాక్‌ కలిస్‌ లాంటి దిగ్గజ ఆటగాళ్లు ఆఫ్రికా జట్టు తరఫున ఆడారు. ఆసియా ఎలెవెన్‌ తరఫున భారత్‌, పాక్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌ ఆటగాళ్లు ఆడగా.. ఆఫ్రికా ఎలెవెన్‌ తరఫున దక్షిణాఫ్రికా, కెన్యా, జింబాబ్వే క్రికెటర్లు ఆడారు. 2007లో చివరిసారిగా ఈ టోర్నీ జరిగింది. 


Also Read: ENG vs IND 5th Test: రోహిత్‌కు కరోనా.. కోహ్లీ, పూజారా ఫామ్‌పై అనుమానాలు! ఇక ఆశలన్నీ వారిపైనే


Also Read: GST Rate: దేశంలో సామాన్యులకు మరో షాక్‌..ఏ ఏ వస్తువులపై జీఎస్టీ పన్ను ఎంతో తెలుసా..?



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.