Changes in GST Rates to Take Effect from July 18: చండీగఢ్‌లో రెండురోజులపాటు జరిగిన జీఎస్టీ కౌన్సిల్ 47వ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కొత్త పన్ను రేట్లను ఖరారు చేశారు. కొత్తగా విధించిన పన్ను రేట్లు జూలై 18 నుంచి అమల్లోకి రానున్నాయి. వివిధ వస్తువులపై జీఎస్టీ పన్ను రేట్లు కింది విధంగా ఉన్నాయి.
పెరిగిన జీఎస్టీ పన్ను రేట్లు ఇవే..!
* వంటింట్లో విరివిరిగా వినియోగించే ప్యాకింగ్, లేబుల్ వేసిన పాలు, పెరుగు, చేపలపై 5 శాతం జీఎస్టీ, బ్యాంక్ ఖాతాదారులకు అందించే చెక్ బుక్‌లపై 18 శాతం జీఎస్టీ విధింపు
* రూ.వెయ్యి కంటే తక్కువగా ఉన్న హోటల్ గదులపై 12 శాతం జీఎస్టీ..గతంలో ఎలాంటి జీఎస్టీ పన్ను ఉండేది కాదు.
* రూ.5 వేలు అంతకంటే ఎక్కువగా ఉన్న ఆస్పత్రుల గదుల్లో ఉంటే వస్తువులపై 5 శాతం జీఎస్టీ విధింపు
* గోధుమ పిండి, బెల్లం, ఉబ్బిన బియ్యం, ఎండు చిక్కుళ్లు, మకనా, సేంద్రీయ ఆహారం, కంపోస్ట్ ఎరువుపై 5 శాతం జీఎస్టీ
* లెదర్ ప్రాజెక్ట్, సోలార్ వాటర్ హీటర్‌లపై 5 శాతం నుంచి 12 శాతం జీఎస్టీ పెంచుతూ నిర్ణయం
* డ్రాయింగ్ ఇంక్, ప్రింటింగ్, ఎల్‌ఈడీ బల్బులకు ఉపయోగించే వస్తువులు, బ్రేడ్లు, ఫోర్క్, స్పూన్లపై విధించే పన్ను 12 శాతం నుంచి 18 శాతానికి పెంపు
జీఎస్టీ పరిధిలో తగ్గిన వస్తువుల వివరాలు..!
* ఆర్థోపెడిక్ సంబంధించిన వస్తువులపై 12 శాతం నుంచి 5 శాతానికి పన్ను తగ్గింపు
* రోప్ వేస్, ట్రాన్స్‌పోర్ట్ గూడ్స్‌పై జీఎస్టీ పన్ను 18 శాతం నుంచి 5 శాతానికి కుదింపు
* ట్రక్, సరుకు రవాణా వాహనాల అద్దెపై పన్ను తగ్గింపు
Also read:Mask Must in Telangana: తెలంగాణలో ఇక మాస్క్ తప్పనిసరి..ధరించకపోతే భారీ జరిమానా..!
Also read: Corona Updates in India: భారత్‌లో ఫోర్త్ వేవ్ రానుందా..ఇవాళ్టి కరోనా కేసులు ఎన్నంటే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook