Virat Kohli Test captaincy: క్రికెట్ కింగ్ విరాట్ కోహ్లీ మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టీమ్ ఇండియా టెస్టు కెప్టెన్​ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు కోహ్లీ. ఇప్పటికే టీ20, వన్డె కెప్టెన్సీల నుంచి కూడా కోహ్లీ తప్పుకున్న విషయం తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్​లో భారత్​ జట్టు ఘోరంగా పరాజయం పాలైన విషయం తెలిసిందే. చివరి మ్యాచ్​లో టీమ్ ఇండియా పేలవ ప్రదర్శన కనబర్చడం వల్లే పరాజయం పాలైనట్లు కూడా విమర్శలు వచ్చాయి.


ఈ విమర్శల వస్తున్న సమయంలోనే.. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం గమనార్హం.


ఈ మేరకు ట్విట్టర్ ద్వారా కోహ్లీ ఓ లేఖ రాశాడు. అందులో టీమ్ ఇండియా మాజీ కోచ్​ రవిశాస్త్రి, మాజీ సారథి ధోనీలకు కృతజ్ఞతలు తెలిపాడు కోహ్లీ.


ఏడేళ్లుగా ఎంతో కష్టపడి జట్టును సరైన దిశలో నడిపించానని.. తన బాధ్యతలు నిజాయితిగా నిర్వహించానని పేర్కొన్నాడు కోహ్లీ. ప్రతి ఒక్కరు ఎప్పుడో ఒకప్పుడు విరామం తీసుకోక తప్పదని లేఖలో రాసుకొచ్చాడు.



కొన్నాళ్లుగా కోహ్లీ కెప్టెన్సీ వివాదం..


కొన్నాళ్లుగా కోహ్లీ కెప్టెన్సీ వివాదంలో పడింది. ఐపీఎల్​ 2021 ముగిసిన వెంటనే.. ఆర్బీబీ కెప్టెన్సీకి గుడ్​బై చెప్పాడు కోహ్లీ. ప్లేయర్​గా కొనసాగుతానని మాత్రం వెల్లడించాడు.


ఇదిలా ఉండాగా.. టీ20 ప్రపంచప కప్​లో సైతం భారత్​ ఆకట్టుకోలేకపోయింది. దీనితో టీ20 వరల్డ్ కప్ ముగిసిన వెంటనే.. టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు స్వయంగా ప్రకటించాడు కోహ్లీ.


అయితే వన్డె కెప్టెన్సీ విషయంలో మాత్రం బీసీసీఐ కోహ్లీని తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో కోహ్లీ వర్సెస్ బీసీసీఐ అనే రేంజ్​లో వివాదం నడిచింది. ఈ విషయం ఇప్పుడిప్పుడే సద్దుమనుగుతుండగా.. తాజాగా టెస్టు కెప్టెన్సీ నుంచి కూడా కోహ్లీ తప్పుకుంటూ సంచలన నిర్ణయం తీసుకోవడం గమనార్హం.


Also read: IND vs SA: దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్​ ఓటమితో.. టీమ్ ఇండియాపై సునీల్ గావస్కర్ అసంతృప్తి


Also read: AUS vs ENG: కెప్టెన్‌ను ఔట్ చేసిన కెప్టెన్‌.. బంతిని ఎదుర్కోలేక బొక్కబోర్లాపడ్డ స్టార్ బ్యాటర్ (వీడియో)


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook