IND vs SA: దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్​ ఓటమితో.. టీమ్ ఇండియాపై సునీల్ గావస్కర్ అసంతృప్తి

IND vs SA: దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్​ల టెస్టు సిరీస్​లో భారత్​ ఓటమిపై సునీల్​ గావస్కర్​ కీలక వ్యాఖ్యలు చేశారు. చివరి మ్యాచ్​లో టీమ్​ ఇండియా తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 15, 2022, 02:46 PM IST
  • దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్​ ఓటమితో టీమ్​ ఇండియాకు విమర్శలు
  • ఆట తీరుపై మండిపడుతున్న సీనియర్​ క్రికెటర్లు
  • కోహ్లీ సేన తీరుపై సునీల్ గావస్కర్​ అసంతృప్తి
IND vs SA: దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్​ ఓటమితో.. టీమ్ ఇండియాపై సునీల్ గావస్కర్ అసంతృప్తి

IND vs SA: దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో భారత్ 2-1 తేడాతో ఓడిపోయింది. దీంతో దక్షిణాఫ్రికా గడ్డపై సిరీస్ కైవసం చేసుకోవాలన్న భారత్ కల (India lost test Series with SA 
) నెరవైరలేదు.

చివరి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా.. అన్ని విధాలుగా విఫలమైంది. బౌలర్లు, బ్యాట్స్‌మెన్ పూర్తిగా (Team India Failure test Series with SA) చేతులెత్తేశారు.

టీమ్​ ఇండియా పేవలవ ప్రదర్శనపై.. మాజీ క్రికెటర్​ సునీల్​ గావస్కర్​ టీమ్​ ఇండియాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కోహ్లీ సేన ఆట తీరుపై విమర్శలు (Sunil Gavaskar slams Virat Kohli) గుప్పించారు. దక్షిణాఫ్రికా గడ్డపై సిరీస్ కైవసరం చేసుకోవాలన్న లక్ష్యం.. ఓ పీడకలగా మిగిలిపోయిందన్నారు.

గావస్కర్ ఇంకా ఏమన్నారంటే..

చివరి మ్యాచ్​ గురించి స్టార్​ స్పోర్ట్స్​లో గావస్కర్​ మాట్లాడాడు. లంచ్​ బ్రేక్ తర్వాత.. శార్దుల్ ఠాకూర్, జస్​ప్రీత్ బుమ్రా ఎందుకు బౌలింగ్ చేయలేదో తనకు అర్థం కాలేదని అన్నాడు. కోహ్లీ తీసుకున్న ఈ నిర్ణయంపై గావస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. మ్యాచ్​ గెలవలేమని భారత్​ దాదాపు ముందే నిర్ణయించుకున్నట్లు అభిప్రాయపడ్డాడు.

ఇక రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్​ చేసే సమయంలో ఫీల్డింగ్ సరిగా లేకపోవడంపై కూడా గావస్కర్ టీమ్ ఇండియాపై ప్రశ్నల వర్షం కురిపించాడు. ఆ సమయంలో ఫీల్డర్ల ప్లేస్​మెంట్​ సరిగా లేదన్నాడు. అందువల్లే బ్యాటింగ్​కు క్లిష్టమైన పిచ్​లో సైతం దక్షిణాఫ్రికా అద్భుతంగా ఆడగలిగిందన్నాడు.

మొదటి మ్యాచ్​లో అద్భుతం చేసినా..

మూడు మ్యాచ్​ల టెస్టు సిరీస్​లో భాగంగా.. సెంచూరియాలో మొదటి మ్యాచ్ జరిగింది. ఇందులో 113 పరుగుల తేడాతో టీమ్ ఇండియా అద్భుత విజయం సాధించింది.

జొహన్నస్ బర్గ్​లో జరిగిన రెండో మ్యాచ్​లో మాత్రం ఒటమి పాలైంది. ఇక తాజాగా కేప్​టౌన్​లో జరిగిన మూడో మ్యాచ్​లో పేలవ ప్రదర్శనతో 1-2 తేడాతో సిరిస్​లో ఓటమి పాలైంది.

ఇప్పటి వరకు దక్షిణాఫ్రికా గడ్డపై భారత్​ ఒక్క టెస్టు​ సిరీస్​ కూడా గెలవలేదు. ఈ సారి సిరీస్​ గెలవాలన్న కోహ్లీ కల మరోసారి కలగానే ఉండిపోయింది.

చివరి టెస్టు సాగిందిలా..

చివరి టెస్టులో 212 పరుగుల లక్ష్యాన్ని.. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కీగన్ పీటర్సన్ 81 పరుగులు చేసి అద్భుతంగా రాణించాడు. వాండెర్ డస్సెన్ 41, టెంబా బావుమా 32 పరుగులతో నాటౌట్​గా నిలిచి.. 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్​లో ఏ దశలోనూ ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోయింది టీమ్ ఇండియా. బుమ్రా, మహమ్మద్ షమి, శార్దుల్ ఠాకూర్​లు ఒక్కో వికెట్​ పడగొట్టారు.

Also read: అలానేనా ప్రవర్తించేది.. విరాట్ కోహ్లీకి జరిమానా విధించాలి లేదా సస్పెండ్ చేయాలి! ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఫైర్!!

Also read: Virat Kohli: అందుకే ఓడిపోయాం.. ఇక వారికి గ్యారంటీ ఇవ్వలేం! 30-45 నిమిషాల్లోనే మ్యాచులను కోల్పోతున్నాం: కోహ్లీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News