Virat Kohli: రికార్డ్స్‌లో నా పేరు ఉండటం కాదు.. నా పేరు మీదే రికార్డ్స్ ఉంటాయి! వాల్తేరు విరాట్‌ను చూసేయండి
Star Sports Telugu morphed Chiranjeevi`s Waltair Veerayya poster as Virat Kohli. వాల్తేరు వీరయ్య సినిమాలోని చిరంజీవి పోస్టర్‌ని మార్ఫ్ చేసి విరాట్ కోహ్లీ ఫొటో పెట్టి స్టార్ స్పోర్ట్స్ తెలుగు పోస్టు చేసింది.
Virat Kohli as Chiranjeevi in Waltair Veerayya Movie: విరాట్ కోహ్లీ.. సగటు క్రికెట్ అభిమానికి ఈ పేరు గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రత్యర్థి ఎవరైనా.. బౌలర్ ఎలాంటోడైనా.. మైదానం ఎలా ఉన్నా.. ఫార్మాట్ ఏదైనా కోహ్లీ బరిలోకి దిగితే పరుగుల వరద పారాల్సిందే. తన అద్భుత బ్యాటింగ్‌తో భారత జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో రికార్డుల మోత మోగించి 'కింగ్' అనే ట్యాగ్ తగిలించుకున్నాడు. పరుగుల మెషిన్, కింగ్ కోహ్లీ, రికార్డుల రారాజు, చేజింగ్ మాస్టర్.. ఇలా కోహ్లీకి క్రికెట్ ప్రపంచం ముద్దుగా పెట్టుకున్న పేర్లు. కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు.
రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ గత రెండు సంవత్సరాలుగా ఫామ్ లేమితో సతమతమయ్యాడు. అయితే 2022 చివరలో పూర్వపు ఫామ్ అందుకుని పరుగుల వరద పారించాడు. అయితే కొత్త ఏడాది 2023లో విరాట్ ఇంకా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. 2023లో శ్రీలంకతో భారత్ ఆడిన టీ20 సిరీస్‌లో విరాట్ ఆడలేదు. జనవరి 10 నుంచి వన్డే సిరీస్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ ఎంట్రీపై ప్రముఖ స్పోర్ట్స్ ఛానల్ ‘స్టార్ స్పోర్ట్స్ తెలుగు’ ఓ ఆసక్తికర ట్వీట్ చేసింది. ఈ సంక్రాంతికి విడుదల కానున్న మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘వాల్తేరు వీరయ్య’లోని డైలాగ్‌తో స్వాగతం పలికింది.
'రికార్డ్స్‌లో నా పేరు ఉండటం కాదు.. నా పేరు మీదే రికార్డ్స్ ఉంటాయి. కింగ్ కోహ్లీ బ్యాక్ ఇన్ యాక్షన్' అని స్టార్ స్పోర్ట్స్ తెలుగు ట్వీట్ చేసింది. ఈ ట్వీటుకు వాల్తేరు వీరయ్య సినిమాలోని చిరంజీవి పోస్టర్‌ని మార్ఫ్ చేసి కోహ్లీ ఫొటో పెట్టి పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కోహ్లీ ఫాన్స్ ఈ ఫొటోపై లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. 'చిరంజీవి కంటే విరాట్ కోహ్లీనే బాగా సెట్ అయ్యాడు' అని కామెంట్స్ చేస్తున్నారు.
బంగ్లాదేశ్ పర్యటన తర్వాత శ్రీలంకతో స్వదేశంలో జరిగిన టీ20 సిరీస్‌లో విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకున్నాడు. వన్డే సిరీస్‌తో మంగళవారం జరిగితే తొలి మ్యాచ్‌తో మళ్లీ మైదానంలో దిగనున్నాడు. కొత్త ఏడాదిలో కోహ్లీ సెంచరీ చేయాలని ఫాన్స్ కోరుకుంటున్నారు. అంతర్జాతీయ కెరీర్‌లో కోహ్లీ ఇప్పటివరకు 104 టెస్టుల్లో, 265 వన్డేల్లో, 115 టీ20 మ్యాచ్‌ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అంతర్జాతీయ స్థాయిలో 72 సెంచరీలు పూర్తి చేసుకున్న కోహ్లీ.. 24 వేలకు పైగా రన్స్ చేశాడు.
Also Read: Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్ పాకిస్థాన్‌లో ఉంటే.. ఆ పాలసీకి బలయ్యేవాడు: సల్మాన్
Also Read: Chiranjeevi: కొరటాల శివపై మెగాస్టార్ ఇన్ డైరెక్ట్ కౌంటర్.. నిజంగా పెడచెవిన పెట్టారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.