Here is Virat Kohlis Top Records after he hits T20I Century vs Afghanistan in Asia Cup 2022: టీమిండియా రన్‌ మెషిన్‌ విరాట్‌ కోహ్లీ పంజా విసిరాడు. పరుగుల వేటలో ఆకలిగొన్న పులిలా.. బౌలర్లపై విరుచుకుపడి రన్స్ బాదాడు. మునుపటి కోహ్లీని తలపిస్తూ అభిమానులకు అసలైన మజా అందించాడు. తన అభిమానులు కాలర్ ఎగరేసుకునేలా చేశాడు. తన ఫామ్ మీద వచ్చిన విమర్శకులకు దీటైన సమాధానమిస్తూ సూపర్‌ సెంచరీ చేశాడు. ఆసియా కప్‌ 2022 సూపర్‌ 4లో భాగంగా గురువారం అఫ్గనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ బాదాడు. కోహ్లీకి టీ20ల్లో ఇదే మొదటి సెంచరీ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అఫ్గనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ.. 2 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 122 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. పాత కోహ్లీని తలపిస్తూ మెరుపు షాట్లతో స్టేడియం నలుదిక్కులా బౌండరీల మోత మోగించాడు. తొలి ఓవర్లో ఎలాంటి ఉత్తేజంతో కనిపించాడో.. చివరి ఓవర్లోనూ అదే ఉత్తేజంతో ఉన్నాడు. శతకం అనంతరం కోహ్లీ హాయిగా ఓ నవ్వు నవ్వేశాడు. దాంతో మైదానంలోని ఫాన్స్ అతడికి 'టేక్ ఏ బో' చెప్పారు. ఇక కోహ్లీ ఈ ఇన్నింగ్స్ దెబ్బకు ఎన్నో రికార్డులు బద్దలు అయ్యాయి. 


ఈ సెంచరీతో అంతర్జాతీయ టీ20లలో అత్యధిక పరుగులు (3584) చేసిన రెండో బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ (3620) మొదటి స్థానంలో ఉన్నాడు. మార్టిన్ గప్తిల్ (3497) మూడో స్థానంలో ఉన్నాడు. అఫ్గనిస్తాన్‌తో మ్యాచుకు ముందు మూడో స్థానంలో ఉన్న కోహ్లీ.. గప్తిల్‌ను అధిగమించి రెండో స్థానానికి చేరుకున్నాడు.  


విరాట్ కోహ్లీ టాప్ రికార్డ్స్ ఇవే:


# అంతర్జాతీయ కెరీర్‌లో 71వ సెంచరీ. 


# అంతర్జాతీయ టీ20ల్లో తొలి సెంచరీ. 


# అంతర్జాతీయ టీ20ల్లో భారత తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు (122 నాటౌట్)


# అంతర్జాతీయ టీ20ల్లో 3500 పరుగుల మైలురాయిని అందుకున్న రెండో బ్యాటర్. 


# అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు (33) చేసిన బ్యాటర్. 


# ఆసియా కప్ 2022లో అత్యధిక పరుగులు (276). 


# అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు (71) చేసిన రెండో బ్యాటర్. 


# అంతర్జాతీయ క్రికెట్‌లో 24000 వేల పరుగులు. 


# అంతర్జాతీయ టీ20ల్లో 100 సిక్సులు. 


Also Read: Virat Kohli Century: ఈ సెంచరీ నీకే అంకితం.. మైదానంలో ఎమోషనల్ అయిన విరాట్ కోహ్లీ!


Also Read: 'Oke Oka Jeevitham' Review: ఇంటరెస్టింగ్ గా శర్వానంద్ 'ఒకే ఒక జీవితం' రివ్యూ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook