Virat Kohli dedicates his 71 Century to Anushka Sharma: భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ కరవును ముగించాడు. 2019 నవంబర్‌ 23న బంగ్లాదేశ్‌తో జరిగిన డే నైట్‌ టెస్టులో శతకం బాదిన విరాట్.. 1021 రోజుల (2022 సెప్టెంబర్ 8) తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ నమోదు చేశాడు. రన్ మెషిన్ 12 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 122 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దాంతో అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్ 71 సెంచరీ నమోదు చేశాడు. విరాట్ సెంచరీ చేయగానే ఫాన్స్ అందరూ ఎగిరి గంతులేశారు. వారి ఆనందానికి అవడులేకుండా పోయాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీమిండియా ఇన్నింగ్స్‌ ముగిసిన అనంతరం విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ... ఈ సెంచరీని తన భార్య అనుష్క శర్మ, కూతురు వామికాకు అంకితం ఇస్తున్నట్లు చెప్పాడు. 'గత మూడేళ్ళుగా బయట చాలా విషయాలు జరుగుతున్నాయని నాకు తెలుసు. అవన్నీ చాలా నేర్పించాయి. నా దృక్పథాన్ని మార్చాయి కూడా. టీ20 ఫార్మాట్‌లో సెంచరీ చేస్తాననుకోలేదు. 71వ సెంచరీ చేయడం షాకింగ్‌గా అనిపించింది. చాలా రోజులుగా సెంచరీ చేయలేకపోయా.. చాలామంది నా ఫామ్ గురించి మాట్లాడారు. అయితే నేను మాత్రం ఇప్పటికే చేసిన 70 సెంచరీల గురించే ఆలోచించా' అని అన్నారు. 



'బయట ఎన్నో జరిగినా నాకు అండగా నిలబడిన వ్యక్తి.. అనుష్క శర్మ. క్లిష్ట సమయాల్లో నా సతీమణి చాలా దైర్యం చెప్పింది. ఈ సెంచరీని ఆమెకు, నా కూతురు వామికకు అంకితమిస్తున్నా. ఈ నాలుగు వారాల విరామం నాకు ఎంతగానో ఉపయోగపడింది. బ్రేక్ తీసుకున్నాకే నేను ఎంత అలిసిపోయానో స్పష్టంగా అర్థమైంది. విరామం తర్వాత నెట్స్‌లో ఎక్కువ సమయం గడిపాను. మళ్లీ పూర్వ ఫామ్‌ అందుకుంటాననే భావన నాలో కలిగింది. మొత్తానికి పరుగులు చేయడం సంతోషంగా ఉంది' అని విరాట్ కోహ్లీ చెప్పాడు. 


Also Read: మగువలకు షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం ధర! హైదరాబాద్‌లో నేటి పసిడి రేట్లు ఇవే


Also Read: Brahmastra Twitter Review : బ్రహ్మాస్త్ర ట్విట్టర్ రివ్యూ... సినిమా ఎలా ఉందంటే...  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook