Brahmastra Twitter Review : బ్రహ్మాస్త్ర ట్విట్టర్ రివ్యూ... సినిమా ఎలా ఉందంటే...

Brahmastra Twitter Review :  'బ్రహ్మాస్త్ర' సినిమా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. రణబీర్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా.. నెటిజన్లు ఏమంటున్నారు..

Written by - Srinivas Mittapalli | Last Updated : Sep 9, 2022, 09:01 AM IST
  • బ్రహ్మాస్త్ర సినిమా టాక్
  • బ్రహ్మాస్త్రపై ట్విట్టర్ రివ్యూలు ఎలా ఉన్నాయి
  • సినిమాపై నెటిజన్లు ఏమంటున్నారు
Brahmastra Twitter Review : బ్రహ్మాస్త్ర ట్విట్టర్ రివ్యూ... సినిమా ఎలా ఉందంటే...

Brahmastra Twitter Review : రణబీర్ కపూర్-అలియా భట్ జంటగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన 'బ్రహ్మాస్త్ర పార్ట్ 1' ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో ఈ సినిమా బ్రహ్మాస్త్రం పేరుతో విడుదలవుతోంది. సోషియో ఫాంటసీ అడ్వెంచర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ గెస్ట్ రోల్‌లో కనిపించనుండటం విశేషం. అమితాబ్ బచ్చన్, అక్కినేని నాగార్జున, మౌని రాయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. బాలీవుడ్‌లో ఇటీవలి కాలంలో వచ్చిన సినిమాలు వచ్చినట్లు డిజాస్టర్స్‌ మూటగట్టుకుంటున్న తరుణంలో బ్రహ్మాస్త్ర ఆ పరంపరను బ్రేక్ చేస్తుందా.. సినిమా చూసిన నెటిజన్లు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం... 

'బ్రహ్మాస్త్ర థియేటర్‌లో చూడాల్సిన సినిమా. దర్శకుడు అయాన్ ముఖర్జీ ప్రేక్షకులకు చెప్పిందే తెరపై చూపించాడు. అలా అని సినిమాలో లోపాలేమీ లేవని కాదు. రణబీర్ కపూర్, అలియా భట్‌ల నటన కట్టిపడేస్తుంది.' అంటూ ఓ నెటిజన్ తన రివ్యూను ట్విట్టర్‌లో షేర్ చేశాడు.

'సినిమాలో ది బెస్ట్ ఏంటంటే.. చకచకా సాగిపోయే స్క్రీన్‌‌ప్లే. 1.24 గంటలు అసలు ఎలా గడిచిపోయాయో తెలియదు. తెరపై కనిపించే దృశ్యాలు అద్భుతంగా ఉంటాయి. అయాన్ ముఖర్జీ అంచనాలను అందుకున్నాడు. సెకండాఫ్ కూడా అద్భుతంగా ఉంటుందని ఆశిస్తున్నా.' అంటూ మరో నెటిజన్ తన రివ్యూ ఇలా చెప్పుకొచ్చాడు.

'బ్రహ్మాస్త్ర  ఒక గేమ్ ఛేంజర్..  వాటే ఫిలిం.. ఒక్క సెకను కూడా రెప్ప వాల్చరు..' అంటూ మరో ట్విట్టర్ ఖాతాలో ఇలా వన్ సెంటెన్స్‌లో రివ్యూ ఇచ్చారు.

'బ్రహ్మాస్త్ర నెక్స్ట్ లెవల్‌ బ్లాక్‌బస్టర్. అయాన్ ముఖర్జీ విజన్, కాన్సెప్ట్, ఎగ్జిక్యూషన్ అద్భుతంగా ఉన్నాయి. ప్రతీ సన్నివేశం రాజమౌళి సినిమా తరహాలో అద్భుతంగా ఉంది. హిందూ పురాణాల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా అద్భుతం అంతే..' అంటూ మరో నెటిజన్ ట్విట్టర్‌లో తన రివ్యూ ఇలా పోస్ట్ చేశాడు.

'సినిమా గజిబిజిగా ఉంది. ఓపెనింగ్ సీన్ నుంచే సినిమాతో ప్రేక్షకుడితో కనెక్ట్ అవదు. 30 నిమిషాల కథను రెండున్నర గంటలకు సాగదీశారు. కొన్ని మంచి సన్నివేశాలు ఉన్నప్పటికీ అవి సినిమాను కాపాడలేవు. సినిమా చాలా డిసప్పాయింట్ చేసింది. అంత భారీ తారగణాన్ని పెట్టుకుని వృథా.' అంటూ మరో నెటిజన్ సినిమాపై పెదవి విరిచాడు.

బాయ్‌కాట్ బాలీవుడ్ ట్రెండ్స్ నడుమ 'బ్రహ్మాస్త్ర'కు పాజిటివ్ టాక్ రావడం ఊరటనిచ్చే అంశం. అయితే అక్కడక్కడా  నెగటివ్ రివ్యూలు కూడా కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం సమయానికి పూర్తి టాక్ బయటకొచ్చే అవకాశం ఉంది. ఇటీవలి కాలంలో సోషియా ఫాంటసీ అడ్వెంచర్‌గా వచ్చిన తెలుగు సినిమా 'కార్తీకేయ 2' హిందీలోనూ సత్తా చాటిన సంగతి తెలిసిందే. సోషియా ఫాంటసీ అడ్వెంచర్‌గా తెరకెక్కిన బ్రహ్మాస్త్ర 'కార్తీకేయ 2' బాటలోనే విజయాన్ని అందుకుంటుందా లేదా వేచి చూడాలి.

Also Read: Gold Price Today 9 September: మగువలకు షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం ధర! హైదరాబాద్‌లో నేటి పసిడి రేట్లు ఇవే

Also Read: Telangana Rain Updates: తెలంగాణలో ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు... ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News