Virat Kohli's Kerla Fans made huge cutout in Trivandrum: టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషిన్‌ 'విరాట్ కోహ్లీ' బ్యాటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోహ్లీ మైదానంలోకి దిగాడంటే.. పరుగుల వరద పారుతుంది, రికార్డుల మోత మోగుతుంది. ముందుగా బ్యాటింగ్ చేసినా లేదా ఛేజింగ్‌కు దిగినా భారీ ఇన్నింగ్స్ ఆడుతాడు. ఇక సెంచరీలను కూడా మంచినీరు తాగినంత సులువుగా చేస్తుంటాడు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లో 71 శతకాలు బాదిన ఘనత కోహ్లీకి ఉంది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (100) తర్వాత అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ విరాటే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విరాట్ కోహ్లీ తన బ్యాటింగ్‌తో ఎంతోమంది అభిమానులను సంపాదించాడు. ఇన్‌స్టాలో కోహ్లీ ఫాలోవర్స్ సంఖ్య చూస్తే.. అతడికి ఏ రేంజ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ఇట్టే అర్థమయిపోతుంది. పాకిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, శ్రీలంక, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ దేశాల్లో కూడా మనోడికి భారీ ఫాన్స్ ఉన్నారు. ఇక భారత దేశంలో అయితే విరాట్ క్రేజ్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. కోహ్లీపై ఉన్న అభిమానంతో అభిమానులు భారీ కటౌట్‌లు ఏర్పాటు చేస్తారు. తాజాగా త్రివేండ్రంలో కూడా భారీ కటౌట్‌ను అక్కడి ఫాన్స్ ఏర్పాటు చేశారు. 


దక్షిణాఫ్రికాతో టీ20, వన్డే సిరీస్‌లు ఆడేందుకు భారత్ సిద్ధమైంది. తిరువనంతపురం వేదికగా బుధవారం జరగనున్న తొలి టీ20తో ఈ పర్యటన ప్రారంభం కానుంది. మొదటి టీ20 మ్యాచ్‌కి ఆతిథ్యమిస్తున్న తిరువనంతపురంలో అభిమానులు విరాట్ కోహ్లీ భారీ కటౌట్‌ ఏర్పాటు చేశారు. ఎలక్షన్స్ ముందు రాజకీయ నాయకులకు ఏర్పాటు చేసే కటౌట్ల కంటే పెద్దదిగా ఉంది. గ్రీన్‌ఫీల్డ్ క్రికెట్ స్టేడియం బయట ఏర్పాటు చేసిన ఈ కటౌట్.. రేపు మ్యాచ్‌కి వచ్చే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోనుంది. ఈ కటౌట్ చూసిన దక్షిణాఫ్రికా క్రికెటర్లు బిత్తరపోయారట. ఈ కటౌట్ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 



2008లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ ఇప్పటి వరకూ 102టెస్టులాడి 49.5 సగటుతో 8074 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు (7 డబుల్ సెంచరీలు), 28 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 262 వన్డేల్లో 57.7 సగటుతో 12344 పరుగులు చేసాడు. ఇందులో 43 సెంచరీలు, 64 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక 107 టీ20లలో 50.8 సగటుతో 3660 పరుగులు చేశాడు. టీ20 క్రికెట్‌లో ఓ సెంచరీ, 33 హాఫ్ సెంచరీలు బాదాడు. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్‌లో 71 సెంచరీలు చేసిన కోహ్లీ.. 24 వేలకు పైగా పరుగులు చేశాడు.


Also Read: ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. ఆదిపురుష్ టీజర్, పోస్టర్ రిలీజ్ డేట్ వచ్చేసింది!


Also Read: దీప్తి శర్మ దెబ్బకు దడుసుకున్న చార్లీ డీన్‌.. వైరల్ అవుతున్న ఇంగ్లండ్ క్రికెటర్ ట్వీట్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook