Virat Kohli Dance: విరాట్ కోహ్లీకి ఏమైంది.. మూడో వన్డేలో వింత ప్రవర్తన! వీడియో వైరల్
Virat Kohli looked in jovial mood ahead of IND vs AUS 3rd ODI. చెపాక్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సరదాగా డాన్స్ చేశాడు.
Virat Kohli Dance to Lungi Dance in IND vs AUS 3rd ODI: మైదానంలో అయినా సరే, బయట అయినా సరే.. విరాట్ కోహ్లీ ఎంత సరదాగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పరుగులు చేయడం మాత్రమే కాదు.. ప్రత్యర్థి ఆటగాళ్లతో సహా సహచర ప్లేయర్స్‌ను కూడా సరదాగా ఆడుకోవడం కూడా తెలుసు. కోహ్లీ తన హావభావాలు, బాడీ లాంగ్వేజ్, డ్యాన్స్‌తో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు. చెపాక్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో కూడా విరాట్ సరదాగా డాన్స్ చేశాడు. అయితే అతడు కాస్త వింతగా ప్రవర్తించాడు.
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా బుధవారం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. దాంతో భారత ఆటగాళ్లు ఫీల్డింగ్ చేసేందుకు మైదానంలోకి దిగారు. సహచరులతో కలిసి బౌండరీ లైన్ వద్ద ఉన్న విరాట్ కోహ్లీ.. 'చెన్నై ఎక్స్‌ప్రెస్' సినిమాలోని ఫేమస్ లుంగీ డ్యాన్స్ పాటకు స్టెప్పులు వేశాడు. స్పిన్నర్ రవీంద్ర జడేజా వద్దకు వచ్చి మరీ డాన్స్ చేశాడు. ఆపై అందరి మధ్య నిలబడి కూడా డాన్స్ చేశాడు.
విరాట్ కోహ్లీ డాన్స్ చేస్తుండగా మిగతా భారత ప్లేయర్స్ సరదాగా నవ్వుకున్నారు. ఇందుకు సబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'javed ansari' అనే ట్విటర్ యూసర్ ఈ వీడియోను పోస్ట్ చేశాడు. ఈ వీడియోని చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. ఈ వీడియోకి లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. 'విరాట్ కోహ్లీకి ఏమైంది' అని ఒకరు కామెంట్ చేయగా.. 'విరాట్ కోహ్లీ వింతగా ప్రవర్తిస్తున్నాడే' అని ఇంకొకరు ట్వీట్ చేశారు.
మూడో వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా 28 ఓవర్లలో 4 వికెట్స్ కోల్పోయి 138 రన్స్ చేసింది. మార్నస్ లాబుషేన్ (28), అలెక్స్ కారీ (5) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుండటంతో.. ఆసీస్ బ్యాటర్లు ఆచితూచి ఆడుతున్నారు. హార్దిక్ పాండ్య వరుస వికెట్స్ పడగొట్టి దెబ్బకొట్టాడు. మిచెల్ మార్ష్ (42) టాప్ స్కోరర్.
Also Read: Rohit Sharma-Virat Kohli: కేవలం 2 రన్స్ మాత్రమే.. ప్రపంచ రికార్డు నెలకొల్పనున్న రోహిత్-కోహ్లీ!
Also Read: Ugadi Festival 2023: ఉగాది రోజు ఈ వస్తువును ఇంటికి తీసుకెళ్లండి.. ఏడాదంతా డబ్బేడబ్బు! మంచి ఆరోగ్యం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.