Coach Rahul Dravid hails Indian Test Captain Virat Kohli: టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli)పై హెడ్‌ కోచ్‌ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) ప్రశంసల వర్షం కురిపించారు. పదేళ్ల టెస్ట్ కెరీర్‌లో కోహ్లీ ఓ ఆటగాడిగా ఎంతో పరిణతి సాధించాడన్నారు. సుదీర్ఘ ఫార్మాట్‌లో ఒక్కో మెట్టు ఎక్కుతూ కెప్టెన్‌ స్థాయికి ఎదగడం అద్భుతమన్నారు. ఓ నాయకుడిగా టీమిండియా ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ విషయంలో విరాట్ విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాడని ద్రవిడ్ పేర్కొన్నారు. ప్రస్తుతం భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనలో ఉంది. టెస్ట్, వన్డే సిరీసులు ఆడేందుకు అక్కడికి వెళ్లింది. ఆదివారం (డిసెంబర్ 26) భారత్, దక్షిణాఫ్రికా (IND vs SA) జట్ల మధ్య సెంచురియాన్ వేదికగా తొలి టెస్ట్ ఆరంభం కానుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు సందర్భంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) షేర్ చేసిన వీడియోలో రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ... 'విరాట్‌ కోహ్లీ ఆటగాడిగా ఎంతో పరిణతి సాధించాడు. నిరంతరం మెరుగవుతూనే ఉంటాడు. కోహ్లీ టెస్ట్‌ క్రికెట్లోకి అరంగేట్రం చేసే సమయానికి నేను క్రికెట్లో కొనసాగుతున్నా. తన మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు నేను జట్టులో ఉన్నాను. కోహ్లీతో కలిసి కొన్ని మ్యాచులు ఆడాను. పదేళ్ల తర్వాత కోహ్లీ ఒక ఆటగాడిగా, పరిపూర్ణమైన వ్యక్తిగా ఎంతో పరిణతి సాధించాడు. ఒక్కో మెట్టు ఎక్కుతూ కెప్టెన్ స్థాయికి ఎదగడం అద్భుతం. కోహ్లీ భారత్‌ తరఫున బ్యాట్‌తో చేసిన ప్రదర్శనలు, జట్టును నడిపించిన విధానం, మైదానంలో అతను సాధించిన విజయాలు అద్భుతంగా ఉన్నాయి' అని అన్నారు. 


Also Read: Thief Fires Bike: చలి మంట కాగేందుకు.. ఏకంగా బైక్‌నే తగలబెట్టిన దొంగ!!


'విరాట్‌ కోహ్లీ ఆటలో పర్‌ఫెక్షన్‌ కోసం ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటాడు. ఓ నాయకుడిగా ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ విషయంలో చాలా విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాడు. ఇప్పుడు నేను జట్టులోకి రావడం చాలా సంతోషంగా ఉంది. అతనికి మద్దతు ఇవ్వడం కోసమ్ నేను ఎదురుచూస్తున్నాను. భారత కోచ్‌గా మంచి సమయాన్ని ఆస్వాదిస్తున్నా. కోచ్ పదవి బాగానే ఉంది కానీ కాస్త హడావిడిగా ఉంది.  నేను కోచ్‌గా వచ్చిన ఈ రెండు నెలల్లో భారత్ చాలా మ్యాచులు ఆడింది' అని రాహుల్ ద్రవిడ్ చెప్పారు. టీ20 ప్రపంచకప్ 2021 అనంతరం ద్రవిడ్ టీమిండియా కోచ్‌గా బాధ్యతలు అందుకున్నారు. 


2011లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ఎంఎస్ ధోనీ (MS Dhoni) సారథ్యంలో విరాట్ కోహ్లీ (Virat Kohli) టెస్ట్ ఫార్మాట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో 4, రెండో ఇన్నింగ్స్‌లో 15 పరుగులు చేశాడు. రాహుల్ ద్రవిడ్‌ (Rahul Dravid)తో కలిసి నాలుగో వికెట్‌కు 43 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో ద్రవిడ్‌తో కలిసి కోహ్లీ బ్యాటింగ్‌ చేశాడు. ఆ మ్యాచ్‌లో 40, 112 పరుగులు చేసిన ద్రవిడ్ 'ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్‌' అవార్డు అందుకున్నారు. ఇప్పటి వరకు 97 టెస్టులు ఆడిన కోహ్లీ 50కే పైగా సగటుతో 7801 పరుగులు చేశాడు. ఇందులో 27 శతకాలు, 27 అర్ధ శతకాలు ఉన్నాయి. 


Also Read: BSNL 5GB Data Plan: బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్.. అతి తక్కువ ధరకే 5 జీబీ డైలీ డేటా!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook