Virat Kohli: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ... ప్రపంచంలో ఒకే ఒక్కడు..
Virat Kohli: రన్ మిషన్ విరాట్ కోహ్లీ ఎవరికీ సాధ్యం కానీ ఫీట్ ను సాధించాడు. వరుసగా నాలుగో సారి `ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్` అవార్డు గెలిచి చరిత్ర సృష్టించాడు.
ICC Men's ODI Cricketer of the Year 2023: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. నాలుగోసారి 'ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్' అవార్డు గెలుచుకున్నాడు. గతంలో 2012, 2017 మరియు 2018లో ఈ పురస్కారాన్ని కోహ్లీ అందుకున్నాడు. నాలుగు సార్లు ఈ ఆవార్డును గెలుచుకున్న మెుట్టమెుదటి క్రికెటర్ గా విరాట్ నిలిచాడు. ఈ క్రమంలో కోహ్లీకి క్రికెటర్లు, ఫ్యాన్స్ నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
గతేడాది జరిగిన వన్డే వరల్డ్ కప్ లో కోహ్లీ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. మెగా టోర్నీలో నిలకడగా రాణించిన కోహ్లీ.. 95.62 సగటుతో 765 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఏకంగా ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచాడు. 2003లో సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన అత్యధిక రన్స్ రికార్డును 2023 ప్రపంచ కప్ లో బద్దలు కొట్టాడు. నిరుడు 36 ఇన్నింగ్స్‌లలో 2,048 పరుగులు చేశాడు.
ప్రస్తుతం టీమిండియా హైదరాబాద్ వేదికగా ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ ఆడుతోంది. అయితే ఈ సిరీస్ కు వ్యక్తిగత కారణాల వల్ల దూరమయ్యాడు విరాట్. తొలి రెండు టెస్టులకు అందుబాటులో ఉండటం లేదు. ఈరోజు మెుదలైన తొలి టెస్టులో టీమిండియా స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించింది. ఇంగ్లీష్ జట్టును కేవలం 246 పరుగులకు ఆలౌట్ చేసింది. ఆటముగిసే సమయానికి టీమిండియా వికెట్ నష్టానికి 119 పరుగులు చేసింది. జైస్వాల్ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు.
Also Read: ICC Awards: చరిత్ర సృష్టించిన సూర్య భాయ్.. వరుసగా రెండోసారి ఐసీసీ అవార్డుకు ఎంపిక..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి