ICC Awards: చరిత్ర సృష్టించిన సూర్య భాయ్.. వరుసగా రెండోసారి ఐసీసీ అవార్డుకు ఎంపిక..

Suryakumar Yadav: టీమిండియా విధ్వంసక బ్యాటర్‌ సూర్యకు ఐసీసీ అవార్డు దక్కింది. టీ20ల్లో అతడు నిలకడగా రాణించడం వల్లే ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు ఐసీసీ తెలిపింది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 24, 2024, 05:25 PM IST
ICC Awards: చరిత్ర సృష్టించిన సూర్య భాయ్.. వరుసగా రెండోసారి ఐసీసీ అవార్డుకు ఎంపిక..

ICC Awards: పొట్టి క్రికెట్‌లో టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. వరుసగా రెండో ఏడాది టీ20 క్రికెట్‌లో ''ఐసీసీ మెన్స్‌ టీ20 క్రికెటర్‌ ఆఫ్‌ ఆఫ్‌ ది ఈయర్‌''’ అవార్డు గెలుచుకున్నాడు. గతేడాది కూడా ఈ అవార్డు మిస్టర్ 360నే వరించింది. దీంతో ఈ పురస్కారం వరుసగా గెలుచుకున్న తొలి ఫ్లేయర్ గా సూర్య అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. 

ఈ ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డు కోసం సూర్యతోపాటు జింబాబ్వే ఆల్‌ రౌండర్‌ సికందర్‌ రజా, న్యూజిలాండ్‌ బ్యాటర్‌ మార్క్‌ చాప్‌మన్‌, అల్పేశ్ రమ్‌జాని (ఉగాండా)లు పోటీ పడ్డారు. అయితే పొట్టి ఫార్మాట్ లో నిలకడగా రాణిస్తూనే సూర్యా భాయ్‌నే ఈ అవార్డు వరించింది. 2023లో సూర్య 17 ఇన్నింగ్స్‌లలోనే 48.86 సగటుతో 733 రన్స్ చేశాడు. ఇందులో రెండు సెంచరీలు కూడా ఉన్నాయి. అతడి స్ట్రైక్‌ రేట్‌ 155.95గా నమోదైంది. 

Also Read: India Vs England: రేపటి నుంచే ఇంగ్లండ్‌తో తొలి టెస్టు... కోహ్లీ స్థానంలో ఆర్సీబీ ఫ్లేయర్?

ఇటీవల ముగిసిన సఫారీ టూర్ లో సూర్య గాయపడ్డాడు. అతడి చీలమండ దెబ్బతింది. దీంతో అతడికి 'స్పోర్ట్స్ హెర్నియా'(Sports Hernia) సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో సూర్య శస్త్రచికిత్స కోసం జర్మనీకి వెళ్లాడు. అక్కడ సర్జరీ సక్సెస్ అవడంతో అందరికి సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపాడు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. త్వరలో ప్రారంభమయ్యే ఐపీఎల్ సీజన్ నాటికి అందుబాటులో ఉండాలని భావిస్తున్నాడు. 

Also Read: BCCI Awards: రవిశాస్త్రి, శుభ్‌మన్ గిల్‌కు బీసీసీఐ అవార్డులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News