2019 వరల్డ్ కప్‌లో ధోనిది కీలక పాత్ర.. గవాస్కర్ కీలక వ్యాఖ్యలు
2019 వరల్డ్ కప్‌లో ధోని పాత్రపై గవాస్కర్ కీలక వ్యాఖ్యలు
2019 వరల్డ్ కప్‌లో ప్రస్తుత టీమిండియా కెప్టేన్ విరాట్ కోహ్లీకి టీమిండియా మాజీ కెప్టేన్ మహేంద్ర సింగ్ ధోని అవసరం అవసరం ఎంతైనా ఉంటుందని ప్రముఖ క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్కర్ అన్నారు. వరల్డ్ కప్ ఆడబోయే జట్టులో ధోని ఉంటే, అది కెప్టేన్‌గా కోహ్లీకే ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని గవాస్కర్ వ్యాఖ్యానించాడు. 50 ఓవర్ల ఫార్మాట్‌లో ధోనికి ఉన్న కెప్టేన్సీ అనుభవం, అతడు ఇచ్చే సలహాలు, సూచనల వల్ల విరాట్ కోహ్లీకి మేలు కలుగుతుందని ఆశాభావం వ్యక్తంచేస్తూ గవాస్కర్ చేసిన పలు కీలక వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో చర్చనియాంశమయ్యాయి. స్టార్ స్పోర్ట్స్ ఛానెల్లో ఓ చర్చాగోష్టిలో పాల్గొన్న సందర్భంగా గవాస్కర్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
50 ఓవర్ల ఫార్మాట్‌లో ఏ క్రికెటర్‌కి ఎక్కడ, ఎలా బౌల్ చేయాలో, ఫీల్డింగ్‌ని ఎలా సర్దుబాటు చేయాలో మహేంద్ర సింగ్ ధోనికి తెలిసినంత బాగా ఇంకెవరికి తెలుసు అని చెబుతూ ధోనిపై గవాస్కర్ తనకు ఉన్న సదభిప్రాయాన్ని వెల్లడించాడు. వరల్డ్ కప్ పర్యటనకు మరో ఏడాది మిగిలి ఉందనగా గవాస్కర్ చేసిన ఈ వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.