Virat Kohli Reaction: హైదరాబాద్ స్టేడియంలో ఫ్యాన్స్ అరుపులకు విరాట్ కోహ్లీ రియాక్షన్ చూశారా ?
Virat Kohli Reaction To Fans: హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఆదివారం ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన 3వ టీ20 మ్యాచ్ టీమిండియా క్రికెట్ ప్రియులకు స్పెషల్ ట్రీట్ లా నిలిచింది. ఆరు వికెట్ల తేడాతో గెలిచి 2-1 తేడాతో ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్ సొంతం చేసుకున్న టీమిండియాను చూసి ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు.
Virat Kohli Reaction To Fans: హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఆదివారం ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన 3వ టీ20 మ్యాచ్ టీమిండియా క్రికెట్ ప్రియులకు స్పెషల్ ట్రీట్ లా నిలిచింది. ఆరు వికెట్ల తేడాతో గెలిచి 2-1 తేడాతో ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్ సొంతం చేసుకున్న టీమిండియాను చూసి ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి సీనియర్ ఆటగాళ్లను దగ్గరి నుంచి చూసిన హైదరాబాద్ ఫ్యాన్స్ తమ ఆనందాన్ని అరుపులతో చాటిచెప్పారు. కేరింతలు కొడుతూ ఆటగాళ్లకు గట్టి బూస్టింగ్‌ని ఇచ్చారు.
టీమిండియా ఆటగాళ్లలో మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి ఆటగాళ్లంటే క్రికెట్ ప్రియులకు అదో ప్రత్యేకమైన అభిమానం. వాళ్లలో ఎవ్వరు కంటపడినా తమ అభిమానాన్ని చాటుకోకుండా ఉండలేరు. ఆదివారం ఉప్పల్ స్టేడియంలోనూ అదే జరిగింది. ఆస్ట్రేలియాతో చివరి టీ20 మ్యాచ్ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీని చూసిన ఫ్యాన్స్ స్టాండ్స్ లో నుంచే కోహ్లీ.. కోహ్లీ.. అంటూ గట్టిగా అరవడం ప్రారంభించారు. తన పేరునే గట్టిగా పిలుస్తూ తనకు జోష్‌ని ఇస్తున్న ఫ్యాన్స్‌ని చూసిన విరాట్ కోహ్లీ... వారికి చేయెత్తి కృతజ్ఞతలు చెబుతున్నట్టుగా రెండుమూడుసార్లు చేయి ఊపాడు. ఇంకేం.. ఆ క్షణం అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. విరాట్ కోహ్లీ అభిమానులను చూసి స్పందించిన తీరును కొంతమంది తమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అన్నట్టు ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్ విజయం అనంతరం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మధ్య బ్రోమాన్స్ వీడియో కూడా సోషల్ మీడియాలో అంతే వైరల్‌గా మారింది. చిన్న పిల్లల్లా ఒకరినొకరు పరపస్పరం అభినందించుకుంటూ, ఆనందం పంచుకుంటున్న ఆ లవ్లీ మూమెంట్స్ (Rohit Sharma - Virat Kohli Bromance Video) అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఆస్ట్రేలియాతో మూడు మ్యాచుల టీ20 సిరీస్ సొంతం చేసుకున్న టీమిండియా ఆ వెంటనే గ్యాప్ లేకుండా సౌతాఫ్రికాతో మరో టీ20 సిరీస్‌కి రెడీ అయింది. ఈ నెల 27న తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ క్రికెట్ స్టేడియం వేదికగా సౌతాఫ్రికాతో తొలి టీ20 మ్యాచ్ జరగనుంది.
Also Read : IND vs AUS: అనారోగ్య సమస్య ఉన్నా..హైదరాబాద్ మ్యాచ్‌లో సూర్యకుమార్ సూపర్ ఇన్నింగ్స్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి