ఐసిసి టెస్ట్ ర్యాంకింగ్స్‌ పురుషుల జాబితాలో విరాట్ కోహ్లీ మళ్లీ నెంబర్ 1 స్థానాన్ని అందుకున్నాడు. 928 పాయింట్స్‌తో విరాట్ కోహ్లీ నెంబర్ 1 స్థానాన్ని అందుకోగా 923 పాయింట్స్‌తో ఆస్ట్రేలియాకు చెందిన స్టీవ్ స్మిత్ రెండో స్థానంలో ఉన్నాడు. ఈర్డెన్ గార్డెన్స్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన డే నైట్ టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ బాదడం ద్వారా కోహ్లీ ఈ రికార్డు అందుకున్నాడు. స్టీవ్ స్మిత్ తొలి స్థానంలోకి రావడానికి ముందు కోహ్లీ ఆ స్థానంలో చాలా కాలం పాటే కొనసాగాడు. అయితే, ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌లో 774 పరుగులు రాబట్టడం ద్వారా ఆసిస్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ అప్పట్లో కోహ్లీ స్థానాన్ని ఆక్రమించుకున్నప్పటికీ.. ఎక్కువ వ్యవధి లేకుండానే కోహ్లీ మళ్లీ తన నెంబర్ 1 స్థానాన్ని తాను తిరిగి సొంతం చేసుకున్నాడు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్ తర్వాతి స్థానాల్లో 877 పాయింట్స్‌తో న్యూజిలాండ్ క్రికెటర్ కేన్ విలియమ్సన్, 791 పాయింట్స్‌తో టీమిండియా క్రికెటర్ ఛటేశ్వర్ పుజారా, 764 పాయింట్స్‌తో ఆసిస్ ఆటగాడు డేవిడ్ వార్నర్, 759 పాయింట్స్‌తో టీమిండియా ఆటగాడు అజింక్య రహానే, 752 పాయింట్స్‌తో జోయ్ రూట్, 731 పాయింట్స్‌తో ఆసిస్ ఆటగాడు మార్నస్, 726 పాయింట్స్‌తో న్యూజిలాండ్ క్రికెటర్ హెన్రీ నికోల్స్, 723 పాయింట్స్‌తో శ్రీలంక ఆటగాడు దిముత్ కరుణరత్నె ఉన్నారు.