Virat Kohli says he never claimed to be vegan: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తాజా వివాదానికి స్వస్తి పలికాడు. నెటిజన్లు తనపై వేస్తున్న సెటైర్లు, కామెంట్లకు ఒక్క పోస్టుతో బదులిచ్చాడు. తాను తినే ఆహారంపై ఎలాంటి ఆందోళన చెందవద్దని, తాను వెజిటేరియన్ అని స్పష్టం చేశాడు. ఇక హాయిగా నిద్రపోవాలంటూ ట్విట్టర్ ద్వారా విరాట్ కోహ్లీ స్పందించాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గతంలో మాంసాహారం తింటూ ఫిట్‌నెస్ మెయింటెన్ చేస్తున్నానని చెప్పిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కొన్నేళ్ల కిందట శాఖాహారిగా మారిపోయానని తెలిపాడు. వెజిటేరియన్‌గా మారిన తరువాత తనలో చాలా మార్పులొచ్చాయని, ప్రశాంతంగా ఉంటున్నానని సైతం పలు సందర్భాలలో విరాట్ కోహ్లీ (Virat Kohli) ప్రస్తావించాడు. క్వారంటైన్‌లో తాను కోడిగుడ్లు తింటున్నానని చెప్పడంతో భారత కెప్టెన్‌పై సెటైర్ల వర్షం మొదలైంది. నువ్వు వేగన్ అని చెప్పావు, కోడిగుడ్డు Vegan ఎప్పుడయ్యిందని కామెంట్లు చేశారు. వివాదం ముదురుతున్న నేపథ్యంలో కోహ్లీ విమర్శలకు, కామెంట్లకు చెక్ పెట్టాడు.


Also Read: Team India కెప్టెన్ విరాట్ కోహ్లీ Vegan అయితే కోడిగుడ్లు తింటున్నాడట, నెటిజన్లు సెటైర్స్ 



‘నేను వేగన్ అని ఏరోజు కూడా చెప్పలేదు. నేను శాఖహారినని స్పష్టం చేస్తున్నాను. హాయిగా ఊపిరి పీల్చుకోండి. మీకు ఇష్టమైన శాఖాహారం తినాలంటూ’ తన తాజా ట్వీట్ ద్వారా పిలుపునిచ్చాడు. బాలీవుడ్ నటి అనుష్క శర్మతో వివాహం అనంతరం కోహ్లీలో మార్పులొచ్చాయని, ఆవేశాన్ని తగ్గించుకున్నానని, దీనికి కారణం తాను తీసుకుంటున్న ఆహారమేనని కొన్ని సందర్భాలలో తెలిపాడు. ప్రస్తుతం ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ (ICC WTC Final) కోసం సన్నద్ధమవుతున్నాడు.


Also Read: Nicholas Pooran Wedding: ప్రేయసిని వివాహం చేసుకున్న వెస్టిండీస్ క్రికెటర్ నికోలస్ పూరన్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook