కెప్టెన్‌గా టీమ్ ఇండియాకు అద్భుత విజయాల్ని అందించిన విరాట్ కోహ్లి..అప్పుడప్పుడూ ఆవేదన వెళ్లగక్కుతూనే ఉంటాడు. అప్పడప్పుడు షాకింగ్ విషయాలు వెల్లడించే విరాట్ కోహ్లీ ఈసారి మరో ఆసక్తికర విషయాల్ని ప్రస్తావించాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విరాట్ కోహ్లీ. అద్భుతమైన బ్యాటర్. టీమ్ ఇండియాకు చిరస్మరణీయ విజయాలు అందించిన మాజీ సారధి. ఎందుకో తెలియదు కానీ ఐసీసీ ఈవెంట్స్ పరంగా విఫలమయ్యాడు. నాలుగు ఐసీసీ ఈవెంట్లలో టీమ్ ఇండియా ఓటమి పాలైంది. అవి 2017 ఛాంపియన్స్ ట్రోపీ ఫైనల్, 2019 వల్డే వరల్డ్‌‌కప్ సెమీస్, 2021 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్,  2021 టీ20 వరల్డ్‌కప్ లీగ్ దశ ఉన్నాయి. అంటే విరాట్ కోహ్లీ కెప్టెన్సీ కెరీర్‌లో ఐసీసీ టోర్నీ విజయం లేదు. ఐసీసీ టోర్నీల్లో సెమీస్, ఫైనల్స్ చేరినా సరే తనపై ఫెయిల్యూర్ కెప్టెన్ ముద్ర వేశారని ఆవేదన చెందాడు విరాట్ కోహ్లీ. 


టోర్నమెంట్ అనేది గెలవడం కోసమే ఆడతామని..కానీ నాలుగు ఐసీసీ టోర్నీల్లో ప్రదర్శనను బట్టి విఫల కెప్టెన్‌గా ముద్ర వేశారన్నాడు. విజయాలు మాత్రమే అనే కోణంలో తానెప్పుడూ ఆలోచించనని..చాలా సందర్భాల్లో జట్టును తీర్చిదిద్దడం చాలా ముఖ్యమని విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. ఏనాడూ ప్రపంచకప్ గెలవని టీమ్స్ ఉన్నాయనే విషయం మర్చిపోవద్దని కోహ్లీ సూచించారు. నేను గెలిచినవాటిని గురించే సంతోషిస్తాను తప్పించి..ఓడినవాటిని తల్చుకుని బాధపడేరకం కాదన్నారు. అన్ని ట్రోఫీలు ఇంట్లోనే ఉండాలనే ఆత్యాశ తనకు లేదన్నారు. 


ఇక ఫామ్ కోల్పోయి కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు మాజీ కెప్టెన్ ఎంఎస్ థోని మాత్రమే తనకు అండగా నిలిచారన్నారు. అలాంటి రెండు సందర్బాల్లో మెస్సేజ్ ద్వారా ధైర్యంగా ఎలా ఉండాలో చెప్పాడన్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విడుదల చేసిన పాడ్‌కాస్ట్ సందర్భంగా విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఒక టీమ్‌గా సాధించినదానిపై తనకెప్పుడూ గర్వంగా ఉంటుందన్నాడు. టోర్నీ అనేది ఓ నిర్దిష్ట కాలానికి సంబంధించినదని..కానీ సంస్కృతి ఎప్పుడూ ఉంటుందన్నాడు.


Also read: Harmanpreet Kaur breaks down: వెక్కివెక్కి ఏడ్చిన హర్మన్‌ప్రీత్ కౌర్.. వీడియో వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook