విరాట్ కోహ్లీపై పిర్యాదు..
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పరస్పర విరుద్ధ ప్రయోజనాలు పొందతున్నాడంటూ మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘం శాశ్వత సభ్యుడు సంజీవ్ గుప్తా బీసీసీఐకి ఫిర్యాదు చేశారు.
న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పరస్పర విరుద్ధ ప్రయోజనాలు పొందతున్నాడంటూ మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘం శాశ్వత సభ్యుడు సంజీవ్ గుప్తా బీసీసీఐకి ఫిర్యాదు చేశారు. కోహ్లీ భారత జట్టులో ఆటగాడిగా, కెప్టెన్ గా కొనసాగుతూనే, ఓ స్పోర్ట్స్ మేనేజ్ మెంట్ కంపెనీకి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడని, కోహ్లీ డైరెక్టర్ గా ఉన్న స్పోర్ట్స్ మేనేజ్ మెంట్ కంపెనీ అనేకమంది భారత ఆటగాళ్లతో ఒప్పందాలు కుదుర్చుకుందని ఆరోపించారు. Also Read: Delhi: ప్రపంచంలోనే అతిపెద్ద కోవిడ్ ఆస్పత్రి ప్రారంభం
Also Read: Rashtrapati Bhavan: రాష్ట్రపతితో ప్రధాని మోదీ భేటీ..
అయితే విరాట్ కోహ్లీ స్పోర్ట్స్ ఎల్ఎల్పీ, కార్నర్ స్టోన్ వెంచర్స్ పార్టనర్స్ ఎల్ఎల్ పీ అనే సంస్థల్లో డైరెక్టర్ గా ఉన్నాడు. ఈ రెండు కంపెనీల్లో డైరెక్టర్లుగా ఉన్న కొందరు కార్నర్ స్టోన్ స్పోర్ట్ అండ్ వాణిజ్య ప్రైవేట్ లిమిటెడ్ అనే మరో సంస్థలో డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. ఈ కార్నర్ స్టోన్ స్పోర్ట్ సంస్థ కోహ్లీ వాణిజ్య ప్రకటనలను మేనేజ్ చేయడంతోపాటు ఇతర క్రికెటర్ల ఒప్పందాలను కూడా పర్యవేక్షిస్తోందని సంజీవ్ గుప్తా వివరించారు. ఈ అంశం పరస్పర విరుద్ధ ప్రయోజనాల పరిధిలోకి వస్తుందని, బీసీసీఐ రాజ్యాంగంలోని 38 (4) నిబంధనకు వ్యతిరేకమని ఆయన పేర్కొన్నారు. దీనిపై బీసీసీఐ ఎథిక్స్ ఆఫీసర్ తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నట్టు ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
Also Read: ( చాహల్, కుల్దీప్‌పై యువరాజ్ సింగ్ కామెంట్స్.. దళిత్ రైట్స్ యాక్టివిస్ట్ ఫిర్యాదుతో కేసు నమోదు )
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..