Rashtrapati Bhavan: రాష్ట్రపతితో ప్రధాని మోదీ భేటీ..

భారత్, చైనాల మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో ఆదివారం భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.

Last Updated : Jul 5, 2020, 04:46 PM IST
Rashtrapati Bhavan: రాష్ట్రపతితో ప్రధాని మోదీ భేటీ..

న్యూఢిల్లీ: భారత్, చైనాల మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో ఆదివారం భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్రపతి భవన్ కు వెళ్లిన ప్రధాని మోదీ రాష్ట్రపతితో సుమారు గంట సేపు వివిధ అంశాలపై చర్చించారు. భారత్, చైనా వివాదం, దేశంలో కరోనా పరిస్థితిపై మోదీ కోవింద్ కు వివరించారు. 

Also Read: Delhi: ప్రపంచంలోనే అతిపెద్ద కోవిడ్ ఆస్పత్రి ప్రారంభం

భారత్, చైనా సరిహద్దు గాల్వన్ లోయలో నెలకొన్న వివాదం కారణంగా గత నెల 15న జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు చనిపోయిన విషయం తెలిసిందే.  ఈ క్రమంలో గత శుక్రవారం మోదీ లడక్ లోని సరిహద్దు ప్రాంతానికి వెళ్లి సైనికులతో మాట్లాడారు. ఇదిలా ఉండగా చైనాకు చెందిన  59 మొబైల్ యాప్స్ను భారత్ లో నిషేధం వంటి పలు కీలక అంశాలు చర్చకొచ్చినట్టు సమాచారం. దేశంలో కరోనా లాక్ డౌన్ విధించిన తరువాత రాష్ట్రపతి కోవింద్ ను ప్రధాని మోదీ కలవడం ఇదే మొదటిసారి. బిల్లు గురించి ప్రశ్నిస్తే.. హైదరాబాద్‌లో మహిళా డాక్టర్‌ నిర్బంధం

జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here.. 

Trending News