Virat Kohli - Kapil Dev: కోహ్లీ ఇగోను వదిలేసి.. జూనియర్ల కెప్టెన్సీలో ఆడాలి! నేనూ అలాగే ఆడా: కపిల్ దేవ్
విరాట్ కోహ్లీ తన ఇగోను పక్కనపెట్టి.. టీమిండియా జూనియర్ల కెప్టెన్సీలో ఆడాలని భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Virat Kohli will have to give up his ego suggest Kapil Dev: అప్పటికే టీమిండియా టీ20, వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లీ (Virat Kohli) తాజాగా టెస్ట్ కెప్టెన్సీని కూడా వదులుకున్నాడు. దక్షిణాఫ్రికాతో ముగిసిన కేప్ టౌన్ టెస్టులో ఓటమి తర్వాత భారత టెస్ట్ జట్టు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు కోహ్లీ సంచలన ప్రకటన చేశాడు. దీంతో కోహ్లీ మూడు నెలల్లో అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికినట్లు అయింది. పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఇప్పటికే జట్టు పగ్గాలు చేపట్టగా.. టెస్టు సారథి (Test Captain) ఎవరన్న అంశంపై త్వరలోనే ఓ స్పష్టత రానుంది.
దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌కు గాయం కారణంగా హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ (Rohit Sharma) దూరం కాగా.. కేఎల్ రాహుల్ (KL Rahul) నేతృత్వం వహించనున్నాడు. ఈ జట్టులో విరాట్ కోహ్లీ సభ్యుడుగా ఉన్నాడు. దాంతో రాహుల్ లాంటి యువ ఆటగాళ్ల సారథ్యంలో విరాట్ ఆడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం, మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ (Kapil Dev) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విరాట్ తన ఇగోను పక్కనపెట్టి.. జూనియర్ల కెప్టెన్సీలో ఆడాల్సి ఉంటుందన్నారు. తాను కూడా క్రిస్ శ్రీకాంత్, మొహ్మద్ అజారుద్దీన్ వంటి ఆటగాళ్ల సారథ్యంలో ఆడినవాడినేనని.. అప్పుడు తాను ఏమాత్రం ఫీలవలేదని పేర్కొన్నారు.
Also Read: Janhvi Kapoor Swimsuit: వీకెండ్ వైబ్స్.. స్విమ్ సూట్‌లో జాన్వీ కపూర్ అందాల విందు!!
తాజాగా కపిల్ దేవ్ ఓ మీడియాతో మాట్లాడుతూ... 'టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలగాలన్న విరాట్ కోహ్లీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా. టీ20 కెప్టెన్సీని వదులుకున్నప్పటి నుంచి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు. ఇటీవలి కాలంలో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాడు. కాబట్టి స్వేచ్ఛగా ఆడేందుకు కెప్టెన్సీని వదులుకోవడం ఉత్తమమైన నిర్ణయం. విరాట్ పరిణతి కలిగిన వాడు. ఈ నిర్ణయం తీసుకునే ముందు అతను బాగా ఆలోచించి ఉంటాడని నేను అనుకుంటున్నా. కెప్టెన్సీని భారంగా భావించి ఉంటాడు. అందుకే ఇలా చేసి ఉంటాడు. ఏదేమైనా కోహ్లీకి మనం మద్దతు ఇవ్వాలి. అతనికి శుభాకాంక్షలు' అని అన్నారు.
'విరాట్ కోహ్లీకి ఒక విషయం చెప్పాలి. కోహ్లీ ఇప్పుడు తన ఇగోను వదిలేసి.. జూనియర్ల కెప్టెన్సీలో ఆడాల్సి ఉంటుంది. నిజానికి సునీల్ గావస్కర్ నా సారథ్యంలో ఆడాడు. నేను క్రిష్ణమాచారి శ్రీకాంత్, మహ్మద్ అజారుద్దీన్ నేతృత్వంలో ఆడాను. అదేమీ నామూషీ కాదు. కోహ్లీ కూడా అహాన్ని పక్కన పెట్టి ఆడాలి. భారత క్రికెట్‌ను ముందుకు తీసుకువెళ్లడానికి తన వంతు కృషి చేయాలి. కొత్త కెప్టెన్లు, కొత్త ఆటగాళ్లకు అతడు దిశా నిర్దేశం చేయాలి. ఒక బ్యాటర్‌గా కోహ్లీ సేవలను కోల్పోవడం అంటే భారత జట్టుకు తీర్చలేని లోటు. కాబట్టి తను ఆడాలి' అని కపిల్ దేవ్ పేర్కొన్నాడు.
Also Read: Calf Born With 3 Eyes: మూడు కళ్లతో పుట్టిన లేగ దూడ.. శివుడి అవతారంగా పూజలు చేస్తున్న గ్రామస్తులు!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook