Virat Kohli: విరాట్ కోహ్లీకే ఐసీసీ `ప్లేయర్ ఆఫ్ ద మంత్` అవార్డు.. కెరీర్లోనే తొలిసారి!
Virat Kohli crowned ICC Mens Player of the Month award for October 2022. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తొలిసారి ఐసీసీ `ప్లేయర్ ఆఫ్ ది మంత్` అవార్డు గెలుచుకున్నాడు.
Virat Kohli wins ICC Mens Player of the Month award for first time: టీమిండియా మాజీ కెప్టెన్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ ఖాతాలో అరుదైన అవార్డు చేరింది. క్రికెట్ కెరీర్‌లో ఇప్పటికే ఎన్నో రికార్డులను అందుకున్న కోహ్లీ.. తొలిసారి ఐసీసీ 'ప్లేయర్ ఆఫ్ ది మంత్' అవార్డు గెలుచుకున్నాడు. 2021 జనవరిలో 'ప్లేయర్ ఆఫ్ ది మంత్' అవార్డును ఐసీసీ ప్రవేశపెట్టగా.. కోహ్లీకి మొదటిసారి దక్కింది. అక్టోబర్ నెలలో అద్భుత ప్రదర్శనకు గాను ఈ అవార్డు వరించింది.
అక్టోబర్ నెలకు గాను 'ప్లేయర్ ఆఫ్ ద మంత్' అవార్డు కోసం విరాట్ కోహ్లీతో పాటు దక్షిణాఫ్రికా బ్యాటర్ డేవిడ్ మిల్లర్, జింబాబ్వే ఆల్ రౌండర్ సికందర్ రజాలను ఐసీసీ నామినేట్ చేసింది. అభిమానులు మాత్రం విరాట్‌కే పట్టం కట్టారు. అక్టోబరు నెలలో కోహ్లీ 205 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. పాకిస్థాన్‌తో జరిగిన పోరులో 82 పరుగులు చేసిన కింగ్ కోహ్లీ.. నెదర్లాండ్స్‌పై 62 పరుగులు చేశాడు. అంతకుముందు ఆసియా కప్ 2022లో రెండు అర్ధ సెంచరీలు, ఒక సెంచరీ బాదాడు.
ఐసీసీ విమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును పాకిస్తాన్ బ్యాటర్ నిడా దార్ కైవసం చేసుకున్నారు. మహిళల ఆసియా కప్ 2022లో వీరోచిత ప్రదర్శనకు నిదా ఈ అవార్డును గెలుచుకున్నారు.అక్టోబర్ నెలకు ఐసీసీ విమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు కోసం భారత మహిళల క్రికెట్ టీం నుంచి జెమీమీ రోడ్రిజ్, దీప్తి శర్మ నామినేట్ అయిన విషయం తెలిసిందే. ఈ అవార్డుని ఇప్పటివరకు ఐదుగురు భారత ప్లేయర్స్ గెలిచారు. రిషబ్ పంత్, ఆర్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, శ్రేయాస్ అయ్యర్, విరాట్ కోహ్లీలు ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు గెలుచుకున్నారు.
Also Read: IND vs ENG: సెమీస్ ముందు టీమిండియాకు శుభవార్త.. సగం మ్యాచ్ గెలిచిన రోహిత్ సేన!
Also Read: కార్తీక పౌర్ణమి రోజున ఈ చిన్న పని చేస్తే.. వద్దన్నా లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook