Vamika: మీడియాకు ధన్యవాదాలు.. ఇలాగే మాకు అండగా ఉంటారనుకుంటున్నా: అనుష్క శర్మ
టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ తాజాగా భారత మీడియా, ఫొటోగ్రాఫర్లకు కృతజ్ఞతలు తెలిపారు.
Anushka Sharma Thanks Media For Not sharing photos of Vamika: టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క (Anushka Sharma) శర్మ తాజాగా భారత మీడియా, ఫొటోగ్రాఫర్లకు కృతజ్ఞతలు తెలిపారు. గతవారం దక్షిణాఫ్రికా పర్యటనకు భారత జట్టు వెళ్తున్న సమయంలో పలువురు ఫొటోగ్రాఫర్లు, మీడియా సంస్థలు ముంబై ఎయిర్‌పోర్ట్ వద్ద కోహ్లీ-అనుష్క ముద్దుల కుమార్తె వామికా (Vamika) ఫొటోలు తీసేందుకు ప్రయత్నించారు. అయితే ఫొటోలు తీయెద్దని కోహ్లీ వారిని కోరారు. టీమిండియా కెప్టెన్ మాటను గౌరవించి.. వామికా ఫొటోలను వారు తీయాలేదు. కొందరు ఫొటోగ్రాఫర్లు వామికా ఫొటోలను తీసినా.. వాటిని బయటపెట్టలేదు. అందుకే అనుష్క ధన్యవాదాలు చెప్పారు.
దక్షిణాఫ్రికా చేరుకున్న అనుష్క శర్మ (Anushka Sharma) తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో మీడియా (Media), ఫొటోగ్రాఫర్లకు (Paparazzi) కృతజ్ఞతలు తెలిపారు. 'మా విన్నపానికి విలువ ఇచ్చి.. వామికా ఫొటోలు, వీడియోలను బాహ్యప్రపంచానికి చూపించకుండా సహకరించిన భారత ఫొటోగ్రాఫర్లు, మీడియాకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెపుతున్నా. ఇకపైనా ఇలాగే మాకు అండగా ఉంటారనుకుంటున్నా. మీడియాకు, సామాజిక మాధ్యమాలకు దూరంగా మా కుమార్తె స్వేచ్ఛగా జీవించాలని కోరుకుంటున్నాం. తను పెద్దయ్యాక మేం తన స్వేచ్ఛకు అడ్డు చెప్పం. తనని ఇప్పుడు వదిలేయాలని కోరుతున్నాం. అందుకు మీ సంపూర్ణ సహకారం కావాలని ఆశిస్తున్నాం. సామాజిక మాధ్యమాల్లోనూవామికా ఫొటోలు పోస్టు చేయని నెటిజన్లకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు' అని అనుష్క పేర్కొన్నారు.
Also Read: Peng Shuai: నాపై లైంగిక దాడి జరగలేదు.. యూటర్న్ తీసుకున్న టెన్నిస్ స్టార్!!
దక్షిణాఫ్రికాకు చేరుకున్న భారత జట్టు క్వారంటైన్ పూర్తి చేసుకుని ప్రాక్టీస్ మొదలు పెట్టింది. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) సమక్షంలో ప్లేయర్స్ అందరూ సిద్ధమవుతున్నారు. డిసెంబర్ 26న సెంచూరియన్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా (INS vs SA) జట్ల మధ్య తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో తొలి టెస్టు మ్యాచ్ ఖాళీ స్టేడియంలో జరుగనుంది. జనవరి 3 నుంచి 7 వరకు వాండరర్స్ స్టేడియంలో రెండో టెస్టు మ్యాచ్, జనవరి 11 నుంచి 15 వరకు కేప్ టౌన్ వేదికగా మూడో టెస్ట్ జరగనుంది. ఆపై 19, 21, 23 తేదీలలో మూడు వన్డేలు జరగనున్నాయి.
Also Read: Rashmika Mandanna: రాహుల్ రవీంద్రన్‌కు ఓకే చెప్పిన రష్మిక.. కొత్త ప్రయోగం ఫలించేనా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి