ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020)లో భాగంగా జరిగిన రెండో మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (Kings XI Punjab)పై ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) సూపర్ ఓవర్‌లో విజయం సాధించడం తెలిసిందే. అయితే లెగ్ అంపైర్ తప్పిదం కారణంగా మ్యాచ్ టై కావడం సూపర్ ఓవర్‌లో తడబాటుకు లోనై పంజాబ్ ఓటమిపాలైంది. అంపైర్ల తప్పిదాన్ని కింగ్స్ పంజాబ్ మాజీ క్రికెటర్, మెంటార్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో ఎత్తిచూపాడు. తమ జట్టుకు జరిగిన అన్యాయాన్ని ఎండగట్టాడు. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘పంజాబ్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్‌కు సంబంధించిన మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ విజేత విషయంలో నేను అంగీకరించను. పంజాబ్ జట్టుకు ఓ షార్ట్ రన్ ప్రకటించిన అంపైర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లభించాలి. షార్ట్ రన్ లేకపోతే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదంటూ’ సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. సూపర్ ఓవర్‌లో పంజాబ్ ఓటమి అనంతరం సెహ్వాగ్ ఈ ట్వీట్ చేయగా.. హాట్ టాపిక్ అవుతోంది. సెహ్వాగ్ చెప్పింది కరెక్టేనంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు.



 



కాగా, ఈ మ్యాచ్‌‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. ఛేదనలో పంజాబ్ సైతం 8 వికెట్లు కోల్పోయి 157 పరుగులే చేయడంతో మ్యాచ్ టై అయింది. సూపర్ ఓవర్‌లో పంజాబ్ రెండు పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోయింది. ఢిల్లీ సునాయసంగా విజయం సాధించి ఐపీఎల్ 2020లో బోణీ కొట్టింది. Hyderabad: లక్షణాలు లేని వారితోనే కరోనా ముప్పు!: సర్వే


ఫొటో గ్యాలరీలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe