Virender Sehwag, Yuvraj Singh and Harbhajan Singh to play for India Maharaja Team In LLC 2022: క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న లెజెండరీ క్రికెటర్లు అందరూ కలిసి మరోసారి మైదానంలోకి దిగనున్నారు. మాజీలు అందరూ లెజెండ్స్ లీగ్ క్రికెట్‌ (Legends League Cricket)లో పాల్గొనబోతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎల్‌ఎల్‌సీ (LLC) ప్రారంభ ఎడిషన్‌ జనవరి 20న ఘనంగా ఆరంభం కానుంది. మూడు జట్ల మధ్య ఒమన్‌లోని అల్ అమెరత్ క్రికెట్ స్టేడియంలో జనవరి 20 నుంచి 29 వరకు ఎల్‌ఎల్‌సీ జరుగనుంది. ఇండియా మహారాజా జట్టు (India Maharaja Team)లో భారత జట్టు మాజీ క్రికెటర్లు బరిలోకి దిగుతున్నారు. 


ఆసియా జట్ల ఆటగాళ్లు ఆసియా లయన్స్ (Asia Lions) టీమ్ తరుపున బరిలోకి దిగుతుండగా.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వెస్టిండీస్ వంటి ఆసియేతర దేశాల మాజీ క్రికెటర్లు వరల్డ్ జెయింట్స్ జట్టు (World Team) తరుపన బరిలో దిగబోతున్నారు.


లెజెండ్స్ లీగ్ క్రికెట్ (ఎల్‌ఎల్‌సీ) 2022 సీజన్‌కి బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. ఎల్‌ఎల్‌సీలోని మ్యాచులు అన్ని రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతాయి.


Also Read: Jasprit Bumrah six: జస్ప్రీత్ బుమ్రా భారీ సిక్స్.. నవ్వు ఆపుకోలేకపోయిన సంజనా గణేశన్ (వీడియో)


ఇండియా మహారాజా జట్టులో వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag), యువరాజ్ సింగ్ (Yuvraj Singh), హర్భజన్ సింగ్‌ (Harbhajan Singh), ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్, ఎస్ బద్రీనాథ్, ఆర్‌పీ సింగ్, ప్రజ్ఞాన్ ఓజా, నమన్ ఓజా, మన్‌ప్రీత్ గోనీ, హెమాంగ్ బదానీ, వేణుగోపాల్ రావ్, మునాఫ్ పటేల్, సంజయ్ బంగర్, నయన్ మోంగియా, అమిత్ బండారిలు బరిలోకి దిగబోతున్నారు. సెహ్వాగ్, యువరాజ్, యూసఫ్, బద్రీనాథ్, నమన్, వేణుగోపాల్ బ్యాటింగ్ భారం మోయనున్నారు. ఇర్ఫాన్, ఆర్‌పీ, ఓజా, గోనీ, మునాఫ్ బౌలింగ్ వేయనున్నారు. 


ఆసియా లయన్స్ జట్టులో షోయబ్ అక్తర్ (Shoaib Akhtar), షాహీదీ ఆఫ్రిదీ (Shahid Afridi), సనత్ జయసూర్య (Sanath Jayasuriya), ముత్తయ్య మురళీధరన్, కమ్రాన్ అక్మల్, చమిందా వాస్, రోమేష్ కలువతర, తిలకరత్నే దిల్షాన్, అజర్ మహ్మద్, ఉపుల్ తరంగ, మిస్బా ఉల్ మక్, మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, మహ్మద్ యూసఫ్, అస్గర్ ఆఫ్ఘాన్, ఉమర్ గుల్ ఉన్నారు. అయితే వరల్డ్ జెయింట్స్ టీమ్ తరుపున ఎవరు బరిలో దిగనున్నారో ఇంకా తెలియరాలేదు. అయితే జాంటీ రోడ్స్, షాన్ పోలాక్, గ్రేమ్ స్మిత్, షేన్ వార్న్, రికీ పాంటింగ్, బ్రియాన్ లారాతో పాటు పలువురు క్రికెటర్లు వరల్డ్ జెయింట్స్ జట్టులో ఆడే అవకాశం ఉంది.


Also Read: IPL 2022 Mega Auction: ఐపీఎల్ 2022 మెగా వేలంకు డేట్ ఫిక్స్.. ఎప్పుడో తెలుసా? హైదరాబాద్‌కు నిరాశే!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook