Jasprit Bumrah six: జస్ప్రీత్ బుమ్రా భారీ సిక్స్.. నవ్వు ఆపుకోలేకపోయిన సంజనా గణేశన్ (వీడియో)

జస్ప్రీత్ బుమ్రా సిక్స్‌ని చూసి స్టాండ్స్‌లో కూర్చున్న అతని సతీమణి సంజనా గణేశన్ ఆశ్చర్యపోయారు. సంజనా నవ్వుతూ చప్పట్లు కొట్టారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 4, 2022, 03:49 PM IST
  • జస్ప్రీత్ బుమ్రా భారీ సిక్స్
  • నవ్వు ఆపుకోలేకపోయిన సంజనా
  • బుమ్రా 11 బంతుల్లో 14 పరుగులు
Jasprit Bumrah six: జస్ప్రీత్ బుమ్రా భారీ సిక్స్.. నవ్వు ఆపుకోలేకపోయిన సంజనా గణేశన్ (వీడియో)

Sanjana Ganesan can not stop smiling after Jasprit Bumrah hits huge six: మూడు టెస్ట్ మ్యాచుల సిరీస్‌లో భాగంగా జోహన్నెస్‌బర్గ్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా (India vs South Africa) జట్ల మధ్య రెండో మ్యాచ్ జరుగుతోంది. సోమవారం టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 202 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ అర్ధ సెంచరీ (50; 133 బంతుల్లో 9×4) చేయగా.. వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ (46; 50 బంతుల్లో 6×4) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే టీమిండియా టాప్ ఆర్డర్ విఫలమయినా.. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు కొన్ని మంచి షాట్లు ఆడి అభిమానులను అలరించారు. 

ఇన్నింగ్స్‌ 62వ ఓవర్‌ వేసిన దక్షిణాఫ్రికా పేసర్ కాగిసో రబడా (Kagiso Rabada) బౌలింగ్‌లో టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా భారీ సిక్స్‌ (Jasprit Bumrah Six) బాది అందరనీ ఆశ్చర్యపరిచాడు. ఆ ఓవర్ మూడో బంతిని రబాడ షార్ట్‌ బాల్‌గా సాధించగా.. బుమ్రా హుక్ షాట్ ఆడాడు. బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి నేరుగా వెళ్లి స్టాండ్స్‌లో పడింది. బుమ్రా సిక్స్‌ని చూసి స్టాండ్స్‌లో కూర్చున్న అతని సతీమణి, స్టార్ స్పోర్ట్స్ ప్రజెంటర్‌ సంజనా గణేశన్ ఆశ్చర్యపోయారు. సంజనా నవ్వుతూ చప్పట్లు కొట్టారు. పక్కనే కూర్చుకున్న సంజనా స్నేహితురాళ్లు అయితే నవ్వు ఆపుకోలేకపోయారు. 

Also Read: IPL 2022 Mega Auction: ఐపీఎల్ 2022 మెగా వేలంకు డేట్ ఫిక్స్.. ఎప్పుడో తెలుసా? హైదరాబాద్‌కు నిరాశే!!

జస్ప్రీత్ బుమ్రా సిక్స్‌పై సంజన గణేశన్ స్పందించిన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కామెంట్లు, మీమ్స్ వర్షం కురుస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా 11 బంతుల్లో 14 పరుగులు చేశాడు. బుమ్రా తొలి ఇన్నింగ్స్‌లో 2 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. బుమ్రా, సంజనా ఇద్దరూ దక్షిణాఫ్రికాలో ఉన్నారు. గతేడాది మార్చి 15న బుమ్రా, సంజనా పెళ్లిచేసుకున్న విషయం తెలిసిందే. అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో గోవాలో వివాహం అయ్యేవరకు ఇద్దరూ వివరాలు గోప్యంగా ఉంచారు. 

ఐపీఎల్ (IPL)లో ముంబై ఇండియన్స్ (MI) తరఫున అద్భుత ప్రదర్శన చేసిన జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah).. 23 జనవరి 2016లో భారత జట్టులోకి ఆరంగేట్రం చేశాడు. గత ఐదు సంవత్సరాలుగా టీమిండియాకు ఎన్నో విజయాలు అందించాడు. ప్రస్తుతం భారత పేస్ విభాగంను తన భుజాలపై మోస్తున్నాడు. మరోవైపు మహారాష్ట్రకు చెందిన సంజన గణేశన్ (Sanjana Ganesan) ఎంటీవీ స్ప్లిట్స్‌విల్లా సీజన్‌ 7తో కెరీర్‌ ఆరంభించారు. 2012లో ఫెమీనా స్టైలిష్ దివాలో ఫైనలిస్టుగా నిలిచారు. 2013లో ఫెమీనా గాడ్జియస్‌గా, ఫెమీనా మిస్ ఇండియా పూణే కిరీటం సొంతం చేసుకున్నారు. ఆపై స్టార్ స్పోర్ట్స్‌ ప్రజెంటర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. 

Also Read: Pushpa on OTT : అతి త్వరలో ఓటీటీలో పుష్ప మూవీ స్ట్రీమింగ్.. తెలుగులో ఆ యాప్‌లో రిలీజ్‌ అవుతుందంట!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News