ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత చదరంగ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ తన సత్తా ఏంటో మరోసారి చూపించాడు. ప్రపంచ ఛాంపియన్ మాగ్నస్‌ కార్ల్‌సన్‌‌ను 34 ఎత్తుల్లో ఓడించాడు. నల్లపావులతో ఆడిన ఆనంద్ తొమ్మిదో రౌండ్‌ గేమ్‌లో అనూహ్యమైన రీతీలో కార్ల్‌సన్‌‌‌ను ఓడించాడు. అయితే తర్వాత ఆడిన ఆటలో వాంగ్‌ హావో (చైనా)తో ఆనంద్ గేమ్‌ను డ్రాగా ముగించడం గమనార్హం. ప్రస్తుతం ఆనంద్‌ ఛాంపియన్‌షిప్‌లో 7.5 పాయింట్లతో కొనసాగడం విశేషం.


అంతకు ముందు  పొంక్రటోవ్‌ (రష్యా)తో జరిగిన ఆటలోనూ, మెక్‌షానే (ఇంగ్లండ్‌)తో జరిగిన గేమ్‌లోనూ, ఫెడసీవ్‌ (రష్యా)తో జరిగిన ఆటలోనూ డ్రాతో ముగించిన ఆనంద్ కార్ల్‌సన్‌తో జరిగిన ఆటలో తనను ఓడించడం విశేషం. 2013లో కార్ల్‌సన్‌ చెన్నైలో జరిగిన ప్రపంచ చదరంగం పోటీలలో  విశ్వనాధన్ ఆనంద్ పై గెలిచి ప్రపంచ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.