Warner On Williamson: ఐపీఎల్-2022లో తన స్నేహితుడైన కేన్ విలియమ్సన్.. సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ గా కొనసాగే అవకాశం ఉందని పరోక్షంగా అన్నాడు డేవిడ్ వార్నర్. ఈ సందర్భంగా సన్ రైజర్స్ ఫ్యాన్స్ అందరూ విలియమ్సన్ ను సపోర్ట్ చేయాలని కోరాడు. “దయచేసి నా స్నేహితుడు కేన్ విలియమ్సన్ కు మీరంతా మద్దతు ఇవ్వండి” అని ఇన్ స్టాగ్రామ్ లో ఓ అభిమాని చేసిన కామెంట్ కు వార్నర్ ఈ విధంగా స్పందించాడు. [[{"fid":"215532","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రపంచకప్ ప్రారంభానికి ముందు ఫామ్ కోసం ఆరాటపడిన డేవిడ్ వార్నర్.. ఆ తర్వాతి మ్యాచ్ ల్లో తిరిగి బ్యాటింగ్ లో విజృంభించాడు. అస్ట్రేలియా ఆడిన మ్యాచుల్లో కీలకపాత్ర పోషించిన వార్నర్.. ఆ జట్టు విజయానికి పోరాడాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. అయితే ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ లో మాత్రం డేవిడ్ వార్నర్ అంచనాలకు తగ్గట్లు రాణించలేకపోయాడు. అనేక సార్లు బ్యాటింగ్ లో విఫలమై ఫామ్ ను కోల్పోయాడు. ఈ నేపథ్యంలో తొలుత కెప్టెన్సీ నుంచి తీసేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం.. ఆ తర్వాత టీమ్ లో నుంచి తప్పించింది. ఇలాంటి పరిస్థితుల నుంచి కోలుకొని టీ20 వరల్డ్ కప్ లో వార్నర్ రాణించాడు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ గా నిలిచి ఆస్ట్రేలియా తొలి టీ20 వరల్డ్ కప్ ట్రోఫీని అందుకునేందుకు తన వంతు కృషి చేశాడు వార్నర్.


అయితే డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 2016లో విజేతగా నిలిచింది. కానీ, ఈ ఏడాది ప్లేఆఫ్స్ కు చేరుకోవడంలోనూ విఫలమైంది. అంతేకాకుండా అత్యధిక ఓటములు ఎదుర్కొని పాయింట్ల పట్టికలో చివరి స్థానంతో సరిపెట్టుకుంది సన్ రైజర్స్. 


Also Read: Hardik Pandya’s watches: హార్థిక్ పాండ్య నుంచి ఎయిర్ పోర్టులో రూ. 5 కోట్ల విలువైన వాచీలు స్వాధీనం


Also Read: Who is RCB captain in IPL 2022: యుజ్వేంద్ర చాహల్‌కి బెంగళూరు కెప్టేన్సీ ?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook