ICC Player of The Month: నవంబర్​ నెలకు గానూ 'ప్లేయర్​ ఆఫ్ ది మంత్'​ విజేతలను ప్రకటించింది ఐసీసీ(ICC). పురుషుల విభాగంలో ఆస్ట్రేలియా ఓపెనర్​ డేవిడ్​ వార్నర్(David Warner)​, మహిళల విభాగంలో వెస్టిండీస్ ఆల్​రౌండర్​ హేలీ మ్యాథ్యూస్(Hayley Matthews) ఈ అవార్డుకు ఎంపికయ్యారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Babar Azam: అప్పుడు విరాట్ కోహ్లీతో ఏం మాట్లాడానో అస్సలు చెప్పను.. అదో పెద్ద సీక్రెట్: బాబర్


ఆసీస్(Australia)ను టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలబెట్టడంతో వార్నర్ కీలకపాత్ర పోషించాడు. దీంతో నవంబర్​కు గానూ 'ప్లేయర్​ ఆఫ్​ ది మంత్'​ రేసులో ఉన్న అబిద్ అలీ, టిమ్ సౌథీలను అధిగమించి..విజేతగా నిలిచాడు. పాకిస్థాన్ స్పిన్నర్ అనమ్ అమిన్, బంగ్లాదేశ్ స్పిన్నర్ నహిదా అక్టర్ నుంచి పోటీ ఎదురైన..చివరకు హేలీ మ్యాథ్యూస్ నే ఈ అవార్డు వరించింది. ప్రతి నెల ఈ అవార్డులను ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ఏడాది జనవరి నుంచి ప్రారంభించింది ఐసీసీ.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook