Sunrisers Hyderabad: జోరుమీదున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ షాక్.. స్టార్ ఆల్‌రౌండర్ ఔట్!
Washington Sundar likely to miss at least next three games for SRH. ఐపీఎల్ 2022లో రెండు వరుస విజయాలతో జోరుమీదున్న తెలుగు జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ షాక్ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ జట్టుకు దూరమయ్యాడు.
Washington Sundar likely to miss at least next three games for Sunrisers Hyderabad: ఐపీఎల్ 2022లో రెండు వరుస విజయాలతో జోరుమీదున్న తెలుగు జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్)కు భారీ షాక్ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ జట్టుకు దూరమయ్యాడు. గాయం కారణంగా ఎస్‌ఆర్‌హెచ్ ఆడే తదుపరి రెండు లేదా మూడు మ్యాచ్‌లకు అతడు దూరం కానున్నట్లు సమాచారం తెలుస్తోంది. చేతికి అయిన గాయం నుంచి సుందర్ కోలుకోవాలంటే.. అతడు కనీసం 10-14 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలట.
సోమవారం ముంబైలోని డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో మూడు ఓవర్లు బౌలింగ్ చేసిన వాషింగ్టన్ సుందర్ కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి పరుగులను కట్టడి చేశాడు. అయితే ఫీల్డింగ్ చేస్తోన్న సమయంలో వాషింగ్టన్ సుందర్ గాయపడ్డాడు. సుందర్ కుడి చేతి బొటన వేలు, చూపుడు వేలు మధ్య గాయం అయింది. ఫలితంగా తన నాలుగు ఓవర్ల కోటాను అతడు పూర్తి చేయలేకపోయాడు. సుందర్ అర్ధాంతరంగా డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోవడంతో.. మిగిలిన ఆ ఒక్క ఓవర్‌ను ఎయిడెన్ మార్క్‌రమ్ వేశాడు.
మ్యాచ్ అనంతరం సన్‌రైజర్స్ హెడ్‌కోచ్ టామ్ మూడీ మాట్లాడుతూ... వాషింగ్టన్ సుందర్ కుడి చేతి బొటన వేలు, చూపుడు వేలుకు మధ్య చీలిక వచ్చిందన్నారు. రాబోయే రెండు మూడు రోజుల పాటు గాయం తీవ్రత ఎలా ఉంటుందో చూడాలన్నారు. సుందర్ కోలుకోవడానికి ఓ వారం కంటే ఎక్కువ రోజులు పట్టవచ్చని టామ్ మూడీ చెప్పారు. రాజస్థాన్ రాయల్స్‌పై మూడు ఓవర్లలో 47 పరుగులు ఇచ్చిన సుందర్.. తదుపరి మూడు గేమ్‌లలో 4 వికెట్లు తీయడంతో పాటు 6.00 కంటే తక్కువ ఎకానమీ రేటును కొనసాగించాడు. బ్యాట్‌తో కూడా విలువైన పరుగులు చేశాడు.
మొదటి రెండు మ్యాచుల్లో ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. చెన్నై సూపర్ కింగ్స్‌పై గెలిచి ఐపీఎల్ 2022లో బోణీ కొట్టింది. గుజరాత్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపొంది రెండో విజయం అందుకుంది. నాలుగు మ్యాచ్‌లలో రెండు విజయాలు అందుకున్న ఎస్‌ఆర్‌హెచ్.. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. శుక్రవారం కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)తో ఎస్‌ఆర్‌హెచ్ తలపడనుంది.
Also Read: Bindu Madhavi: వైరల్ ట్వీట్.. కోలీవుడ్ యంగ్ హీరోతో టాలీవుడ్ హీరోయిన్ ప్రేమాయణం!
Also Read: Ananya Panday Dating: నేను ఒంటరిగా లేను.. అసలు విషయం చెప్పేసిన అనన్య పాండే!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook