Ananya Panday Dating: నేను ఒంటరిగా లేను.. అసలు విషయం చెప్పేసిన అనన్య పాండే!!

Ananya Panday Dating with Ishaan Khatter. తాజాగా లైగర్ బ్యూటీ అనన్య పాండే తన రిలేషన్ షిప్ స్టేటస్ గురించి చెప్పింది. తాను ఇషాన్ ఖట్టర్‌తో డేటింగ్ చేస్తున్నానని చెప్పకనే చెప్పింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 3, 2022, 02:43 PM IST
  • ఫేవరెట్ హీరో ఇషాన్ ఖట్టర్
  • నేను ఒంటరిగా లేను
  • అసలు విషయం చెప్పేసిన అనన్య పాండే
Ananya Panday Dating: నేను ఒంటరిగా లేను.. అసలు విషయం చెప్పేసిన అనన్య పాండే!!

Ananya Panday says My favourite Co Star is Ishaan Khatter: లైగర్ హీరోయిన్ అనన్య పాండే, ఇషాన్ ఖట్టర్ డేటింగ్ చేస్తున్నారని గత కొంత కాలంగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఇటీవలి కాలంలో ఇద్దరు కలిసి తరచూ బయటికి వెలుతున్నారు. అంతేకాదు జంటగా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడం ఆ రూమర్లకు మరింత బలాన్ని చేకూర్చింది. ఇప్పటివరకు తమ డేటింగ్‌పై ఇటు అనన్య కానీ అటు ఇషాన్ కానీ స్పందించలేదు. తాజాగా లైగర్ బ్యూటీ తన రిలేషన్ షిప్ స్టేటస్ గురించి చెప్పాల్సి వచ్చింది. 

తాజాగా బాలీవుడ్ బబుల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనన్య పాండే తాను ఒంటరిగా లేను అని చెప్పకనే చెప్పింది. ఇంటర్వ్యూలో లైగర్ బ్యూటీ అభిమానులతో ముచ్చటించింది. ఈ క్రమంలో తనకు ఎదురైన ప్రశ్నలకు సమాధానాలు చెపుతూ వచ్చింది. ఓ నెటిజన్ అనన్యను రిలేషన్ షిప్ స్టేటస్ గురించి అడగ్గా.. ముందుగా ఆ ప్రశ్న చెప్పకుండా తప్పించుకోవడానికి ప్రయత్నించింది. చివరకు 'నేను సంతోషంగా ఉన్నాను' అంటూ సమాధానం చెప్పింది. దాంతో అనన్య డేటింగ్‌లో ఉన్నట్లు తేలింది. 

మీకు ఇష్టమైన సహనటుడు ఎవరు అని మరొక అభిమాని అనన్య పాండేను అడిగాడు. అందుకు అనన్య ఏమాత్రం ఆలోచించకుండా ఇషాన్ ఖట్టర్ పేరును టక్కున చెప్పేసింది. ఆపై తన సహనటులందరూ అద్భుతంగా నటించారని, సిద్ధాంత్ చతుర్వేది తనతో కలిసి 'ఖో గయే హమ్ కహాన్'లో మళ్లీ పని చేస్తానని చెప్పింది. ఇక తన రిలేషన్ షిప్ స్టేటస్ గురించి ఇన్ డైరెక్టుగా సమాధానం ఇవ్వడం.. ఫేవరెట్ హీరో ఇషాన్  ఖట్టర్ అని చెప్పడంతో వీరిద్దరూ రిలేషన్ షిప్‌లో ఉన్నారని నెటిజన్లు అంటున్నారు. 

అనన్య పాండే, ఇషాన్ ఖట్టర్ 2020లో విడుదలైన 'ఖలీ పీలీ' చిత్రంలో కలిసి నటించారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని వార్తలు షికార్లు చేస్తున్నాయి. అనన్య పాండే ఇటీవల ఇషాన్ ఖట్టర్‌తో కలిసి షాహిద్ కపూర్ పుట్టినరోజు వేడుకలో పాల్గొన్నారు కూడా. ఇక రౌడీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి అనన్య నటించిన లైగర్ సినిమా త్వరలోనే  విడుదల కానుంది. 

Also Raed: విరాట్ కోహ్లీతో ఓపెనింగ్ చేయనున్న దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్.. ఇక పరుగుల వరదే!!

Also Read: ButterFly Teaser: నీ కళ్లను, మెదడును అస్సలు నమ్మకు.. ఆకట్టుకుంటున్న అనుపమ 'బటర్ ఫ్లై' టీజర్!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News