ICC Men's T20 World Cup 2024 Song: అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచకప్ కు నెలరోజుల మాత్రమే సమయం ఉంది. జూన్ 02న ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నకి సంబంధించిన థీమ్ సాంగ్ ను గురవారం ఐసీసీ విడుదల చేసింది. ఈ టీ20 ప్రపంచకప్ యెుక్క అధికారిక గీతాన్ని గ్రామీ అవార్డు విజేత సీన్ పాల్, సోకా సూపర్ స్టార్ కేస్ 'అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్' పేరుతో రూపొందించారు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ వీడియోలో ఎనిమిది సార్లు ఒలింపిక్ గోల్డ్‌ మెడలిస్ట్ ఉసేన్ బోల్ట్, క్రికెట్ స్టార్లు క్రిస్ గేల్, అలీ ఖాన్, శివనారాయణ్ చంద్రపాల్, ఇతర కరేబియన్ ప్రముఖులు సందడి చేశారు. ఇందులో వీరంతా క్రికెట్‌ని సెలబ్రేట్‌ చేసుకుంటూ కనిపించారు. టోర్నమెంట్‌కు 30 రోజుల ముందు సాంగ్ రిలీజై క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. ఈ మ్యాచ్ లు యూఎస్‌, వెస్టిండీస్‌లో జూన్‌ 1 నుంచి 29 వరకు జరుగుతాయి. తొలిసారి 20 జట్లు తలపడబోతున్నాయి. మెుత్తంగా 55 మ్యాచులు జరుగుతాయి. 



టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజు శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ , అర్ష్దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా. రిజర్వ్‌లు: శుభమన్ గిల్, అవేష్ ఖాన్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్.


Also Read: 2024 T20 World Cup: ప్రపంచకప్ కు అదే ఫైనల్ టీమ్ కాదు... రాహుల్ కు కూడా ఛాన్స్ ఉంది.. ఎలాగంటే?


Also Read: 2024 T20 World Cup squad: ఐపీఎల్ లో ముంబై ఫట్.. టీమిండియా స్వ్కాడ్‌లో సూపర్ హిట్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter