Team India Cricketers Holi Celebrations video viral: ఓ వైపు ఐపీఎల్ పండుగ.. మరోవైపు రంగుల హోలీ వేడుక. టీమిండియా క్రికెటర్లు ఈ రెండు పండుగల్లో మునిగితేలుతున్నారు. దేశవ్యాప్తంగా ఐపీఎల్ సీజన్ 17 ధూమ్ దామ్ గా జరుగుతోంది. బంతి, బ్యాట్ కి మధ్య పోరు ఆడియెన్స్ ను మునివేళ్లపై నిలబెడుతోంది. ఐపీఎల్ లో అదరగొడుతున్న టీమిండియా క్రికెటర్లు తాజాగా హోలీ సంబరాల్లో మునిగితేలారు. ఒకరిపై ఒకరు రంగులు పూసుకుంటూ సందడి సందడిగా గడిపారు. ముఖ్యంగా రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ ల అయితే వేరే లెవల్లో హోలీ వేడుకలు చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముంబై ఇండియన్స్ మాజీ సారథి రోహిత్ శర్మ  వాటర్ పైపుతో అంద‌ర్నీ త‌డిపేసి హోలీ సంబరాలు చేసుకున్నాడు. ముంబై ప్రాంచైజీ దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్ వేదికగా పంచుకుంది. మరోవైపు కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ జ‌ట్టు స‌భ్యులు కూడా ఓ రేంజ్ లో వేడుకలు చేసుకున్నారు. కోల్‌క‌తా ఆటగాళ్లు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ను రంగుల్లో ముంచెత్తారు. ఈ వేడుకల్లో మెంటార్ గౌతం గంభీర్(Gautam Gabhir) రంగుల పూసుకుని హల్ చల్ చేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలను కోల్‌క‌తా ఫ్రాంచైజీ ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. మరోవైపు ఢిల్లీ క్యాపిట‌ల్స్ కెప్టెన్ రిష‌భ్ పంత్, డేవిడ్ వార్న‌ర్‌లు సైతం రంగుల్లో మునిగితేలారు. ఈ వీడియోను ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాంచైజీ ఎక్స్ లో పంచుకుంది. 



ఈ సీజన్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే  ముంబై ఇండియన్స్‌ ఓటమిపాలైంది.  అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ చేతిలో ఆరు పరుగుల తేడాతో ఓడిపోయింది. తొలుత గిల్ నేతృత్వంలో గుజరాత్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ముంబై 9 వికెట్లు కోల్పోయి 162 పరుగులు మాత్రమే చేసి పరాజయాన్ని చవిచూసింది. మరోవైపు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో జ‌రిగిన తొలి మ్యాచ్ లో కోల్‌క‌తా విజయం సాధించింది.



Also Read: IPL 2024 full schedule: ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ వచ్చేసింది... ఫైనల్ మ్యాచ్ ఎక్కడంటే?


Also Read: Rohit Sharma Vs Hardik Pandya: అరే.. ఏం చేస్తున్నావ్ రా బాబు.. హార్థిక్ పాండ్యాపై రోహిత్ శర్మ సీరియస్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి