T20 World Cup 2022: టీ20 ఫార్మట్‌లో ప్రపంచ ఛాంపియన్లుగా నిలిచి ఆ జట్లు ఘోరంగా విఫలమయ్యాయి. కనీసం సూపర్ 12 అర్హత సాధించలేకపోయాయి. ఆ అర్హత పొందాలంటే క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లు ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీ20 ఫార్మట్ (T20 Format Cricket)క్రికెట్‌లో వెస్టిండీస్ రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. వన్డే ప్రపంచకప్‌ను కూడా ప్రారంభంలో రెండుసార్లు గెల్చుకుంది. ఇక ఒకసారి టీ20 టైటిల్‌ను, రెండుసార్లు రన్నరప్ టైటిల్‌ను గెల్చుకున్న మరో జట్టు శ్రీలంక(Srilanka). ఈసారి మాత్రం రెండు జట్లు ఘోరంగా విఫలమయ్యాయి. ఫలితంగా 2022లో ఆస్ట్రేలియాలో జరగనున్న సూపర్ 12 దశకు అర్హత సాధించలేకపోయాయి. టీ20 ప్రపంచకప్ 2021 లో దారుణ వైఫల్యమే ఇందుకు కారణం. నవంబర్ 15వ తేదీలోగా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో(ICC T20 Rankings)టాప్ 8లో ఉన్న జట్లు మాత్రమే 2022లో జరిగే టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తాయి. ఈ క్రమంలో వెస్ట్‌ఇండీస్(West indies), శ్రీలంక జట్లు ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకారం 9,10 స్థానాల్లో ఉన్నాయి. టాప్ 8లో లేకపోవడంతో 2022 ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్(T20 World Cup 2022) అర్హత కోల్పోయాయి. తిరిగి ఆ అర్హత పొందాలంటే రెండు జట్లు క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. 


టీ20 ప్రపంచకప్ 2021లో (T20 World Cup 2021) సూపర్ 12 ఆడిన జట్లులో 8 జట్లు అంటే ఆస్ట్రేలియా, ఇండియా, ఇంగ్లండ్, పాకిస్తాన్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్‌లు సూపర్ 12కు అర్హత సాధించాయి. ఈ  ప్రపంచకప్ సూపర్ 12 దశలో బంగ్లాదేశ్ అన్ని మ్యాచ్‌లలో ఓడినా..సొంతగడ్డపై ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లను ఓడించడంతో 8వ ర్యాంకుకు చేరుకుంది. ఫలితంగా 2022 టీ20 ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించింది. 


Also read: Kapil dev: ఐపీఎల్ ముఖ్యమైనప్పుడు.. దేశం కోసం ఏం ఆడతారు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook