వెస్టిండీస్ క్రికెట్ జట్టు ఈ సంవత్సరం అక్టోబర్, నవంబరు నెలల్లో భారత్ రావడానికి షెడ్యూల్ ఖరారవుతోంది. ఈ పర్యటనలో భాగంగా ఇరు జట్లు మూడు టెస్టులు, 5 వన్డేలు, ఓ టీ20 మ్యాచ్ ఆడనున్నాయి. కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా టీ20 జరగనున్నట్లు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ తెలిపారు. అదే క్రమంలో ఐపీఎల్ 2018కి సంబంధించిన క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లు కూడా ఇదే మైదానంలో జరగనున్నట్లు సమాచారం.


వెస్టిండీస్ విషయానికి వస్తే 2014లో తొలిసారిగా భారత గడ్డపై ఆ దేశ క్రికెట్ జట్టు అడుగుపెట్టింది. అయితే ఆ పర్యటన అర్థాంతరంగా ముగిసింది. ఆ తర్వాత 2016లో టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌ల్లో పాల్గొనేందుకు భారత్ వచ్చింది ఆ దేశ జట్టు. ఇది ఆ జట్టు భారత్‌లో చేయబోయే మూడో పర్యటన. మన జట్టు మాత్రం వెస్టిండీస్‌లో రెండు సార్లు పర్యటన చేసింది. 2016లో పలు టెస్ట్ మ్యాచ్‌‌లు ఆడగా.. 2017లో పరిమిత ఓవర్ల మ్యాచ్‌ల్లో ఆడింది