Marlon Samuels: 2 వరల్డ్ కప్‌ల విన్నర్ క్రికెట్‌కు వీడ్కోలు
Marlon Samuels Retirement | ప్రముఖ క్రికెటర్ మార్లోన్ శామ్యూల్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. విండీస్ జట్టుకు కష్టకాలంలో బెస్ట్ మ్యాచ్‌లు ఆడిన బ్యాట్స్‌మెన్‌గా, ఆల్ రౌండర్‌గా మార్లోన్ శామ్యూల్స్ పేరు గడించాడు. చివరగా 2018 డిసెంబర్‌లో వన్డే మ్యాచ్ ఆడాడు.
వెస్టిండీస్ (West Indies) ప్రముఖ క్రికెటర్ మార్లోన్ శామ్యూల్స్ (Marlon Samuels) అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు (Marlon Samuels Retirement) ఈ 39 ఏళ్ల క్రికెటర్ వెల్లడించాడు. ఈ విషయాన్ని క్రికెట్ వెస్టిండీస్ హెడ్ జానీ గ్రేవ్ ధ్రువీకరించాడు. విండీస్ జట్టుకు కష్టకాలంలో బెస్ట్ మ్యాచ్‌లు ఆడిన బ్యాట్స్‌మెన్‌గా, ఆల్ రౌండర్‌గా మార్లోన్ శామ్యూల్స్ పేరు గడించాడు. చివరగా 2018 డిసెంబర్‌లో వన్డే మ్యాచ్ ఆడాడు.
వెస్టిండీస్ జట్టు 2 ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లు నెగ్గడంలో ఈ ఆటగాడు కీలకపాత్ర పోషించాడు. 2012, 2016 టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్‌లో జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో కీలక హాఫ్ సెంచరీలు చేసి కప్పు అందించాడు. వెస్టిండీస్ జట్టుకు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చి జట్టులో నూతన ఉత్సాహాన్ని నింపాడు. మార్లోన్ శామ్యూల్స్ వెస్టిండీస్ జాతీయ జట్టు తరఫున 71 టెస్టులు, 207 వన్డేలు, 67 టీ20 మ్యాచ్‌లలో ప్రాతినిథ్యం వహించాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 11,134 పరుగులు చేయడంతో పాటు 150కి పైగా వికెట్లు పడగొట్టాడు. కెరీర్‌లో 17 సెంచరీలు సాధించాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe