SRH vs MI match: ప్లే ఆఫ్స్‌కి సన్ రైజర్స్.. ఇంటికి కోల్‌కతా

SRH beats MI: సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ముంబై ఇండియన్స్‌పై సత్తా చాటుకుంది. ప్లే ఆఫ్స్‌లో ( Playoffs ) నిలవాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో ఐపిఎల్ పాయింట్స్ పట్టికలో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్న ముంబై ఇండియన్స్‌పై 10 వికెట్ల తేడాతో గెలిచి ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఐపిఎల్ ప్లే ఆఫ్స్‌కి సన్ రైజర్స్ హైదరాబాద్ అర్హత సాధించింది.

Last Updated : Nov 4, 2020, 01:25 AM IST
SRH vs MI match: ప్లే ఆఫ్స్‌కి సన్ రైజర్స్.. ఇంటికి కోల్‌కతా

SRH beats MI: సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ముంబై ఇండియన్స్‌పై సత్తా చాటుకుంది. ప్లే ఆఫ్స్‌లో ( Playoffs ) నిలవాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో ఐపిఎల్ పాయింట్స్ పట్టికలో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్న ముంబై ఇండియన్స్‌పై 10 వికెట్ల తేడాతో గెలిచి ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఐపిఎల్ ప్లే ఆఫ్స్‌కి సన్ రైజర్స్ హైదరాబాద్ అర్హత సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్దేశించిన 150 పరుగుల లక్ష్యాన్ని ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఓపెనర్లే బ్యాటింగ్ చేస్తూ మరో 17 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించడం విశేషం. 

సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్ ( David Warner 85; 58 బంతుల్లో 10 ఫోర్లు,  సిక్సర్), వృద్ధిమాన్ సాహా ( Wriddhiman Saha 58; 45 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్) అజేయంగా రాణించారు. వార్నర్, సాహలు అర్ధ శతకాలు నమోదు చేసి తమ జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించారు. ముంబై ముంబై బ్యాట్స్ మేన్ ని కట్టడి చేయడంలో హైదరాబాద్ బౌలర్లు సక్సెస్ కాగా.. ముంబై విధించిన లక్ష్యాన్ని అందుకోవడంలో హైదరాబాద్ ఓపెనర్స్ సక్సెస్ అయ్యారు. 

ఇదిలావుంటే, పాయింట్స్ పట్టికలో ఇదివరకు నాలుగవ స్థానంలో కొనసాగుతూ ప్లేఆఫ్స్ ఆశలు పెట్టుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టు సన్‌రైజర్స్ గెలుపుతో ఐపిఎల్ నుంచి నిష్క్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మెరుగైన రన్ రేట్ ఉండటంతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఒక ర్యాంక్ కిందకు లాగుతూ పాయింట్స్ టేబుల్‌లో ఏకంగా మూడో స్థానాన్ని ఆక్రమించుకుంది. 

SRH vs RCB in Eliminator match of IPL 2020: ఎలిమినేటర్ మ్యాచ్‌లో హైదరాబాద్ vs బెంగళూరు:
అబుదాబిలో శుక్రవారం జరగనున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి.

Trending News